దేశవ్యాప్తంగా ఇప్పటికే పెట్రోల్ ధరలు, వంటనూనె ధరలు, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇవి చాలవు అన్నట్లు మనిషి అనారోగ్యం బారిన పడితే కొనుగోలు చేసే ఔషధాల ధరలు కూడా పెరగబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి పారాసిటమాల్ సహా రోజూవారీ ఉపయోగించే 800 ఔషధాల ధరలు పెరగనున్నట్లు జాతీయ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌పీపీఏ) ప్రకటించింది. పలు మెడిసిన్స్ ధరలు 10.7 శాతం పెరగనున్నట్లు తెలిపింది. పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్‌లతో…
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా నడుస్తోందని ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయకుమార్ వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై మార్చి 3 దాకా అభ్యంతరాలు స్వీకరణ ఉంటుందన్నారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే కొత్త జిల్లాలలో ఉద్యోగుల విభజన ఇప్పుడు ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే ఉద్యోగుల విభజన ఉంటుందన్నారు. ఆర్డర్ టు వర్క్ ప్రాతిపదికన మాత్రమే కొత్త జిల్లాల్లో ఉద్యోగుల కేటాయింపు…
ప్రముఖ నటుడు మాధవన్ తొలిసారి మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన సినిమా ‘రాకెట్రీ’. భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో విశేష కృషి చేసిన సైంటిస్ట్ నంబి నారాయణ్ బయోగ్రఫీ ఇది. ఇప్పటికే తొలికాపీ సిద్దం చేసుకున్న ఈ మూవీ ట్రైలర్ ను చూసి ప్రధాని నరేంద్రమోదీ మాధవన్, నంబి నారాయణ్ లను ప్రత్యేకంగా అభినందించారు. మాధవన్ నంబి నారాయణ్ గా నటించిన ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్ 1న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ,…