ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా నడుస్తోందని ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయకుమార్ వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై మార్చి 3 దాకా అభ్యంతరాలు స్వీకరణ ఉంటుందన్నారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే కొత్త జిల్లాలలో ఉద్యోగుల విభజన ఇప్పుడు ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే ఉద్యోగుల విభజన ఉంటుందన్నారు. ఆర్డర్ టు వర్క్ ప్రాతిపదికన మాత్రమే కొత్త జిల్లాల్లో ఉద్యోగుల కేటాయింపు…