Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్. ప్రధాని నరేంద్రమోడీతో సాయంత్రం భేటీ కానున్న జగన్.

* నేడు పోలవరం ప్రాజెక్టుని సందర్శించనున్న ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం అధికారులతో మంత్రి అంబటి సమీక్ష

* ఇవాళ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్. హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో అవతరణ వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు.

*విశాఖ ఆంధ్రాయూనివర్శిటీలో మెగా న్యాయ సదస్సు. ప్లాస్టిక్ రహిత సమాజం-అసంఘటిత రంగ కార్మికుల అంశాలపై చర్చ.

* దళితులు, మహిళలపై జరుగుతున్న దాడులను హత్యలను నిరసిస్తూ జూన్ 2న ఛలో రాజ్ భవన్ కు సీపీఐ పిలుపు.  వివిధ జిల్లాలనుంచి సీపీఐ, దళిత సంఘాల నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్న పోలీసులు

*తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సబల మహిళా సాధికారత సదస్సు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ ఆధ్వర్యంలో /జరగనున్న సదస్సు.

*నేడు రేపల్లెలో గడపబగడపకు మన ప్రభుత్వంలో పాల్గొననున్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ రావు.

*నేటి నుంచి గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో వేసవి దృష్ట్యా హైదరాబాద్ నుంచి గుత్తి మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు ప్రయాణం.

*ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న మేకపాటి విక్రమ్ రెడ్డి. పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి..జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నేతలు

*నేడు శ్రీశైలంలో ఆరుద్రోత్సవం సందర్భంగా మల్లికార్జునస్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం

*నంద్యాల: సివిల్స్ లో 69వ ర్యాంకు సాధించిన గడ్డం సుధీర్ కుమార్ రెడ్డికి నేడు కోవెలకుంట్లలో ఘన సన్మానం.

Exit mobile version