- నేడు కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో తెలంగాణ మంత్రులు, ఎంపీల భేటీ, మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం.. ధాన్యం సేకరణపై చర్చ
- టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ పిలుపు, నేడు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు
- నేడు ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్న పంజాబ్ సీఎం భగవంత్‌మాన్… తొలిసారి మర్యాదపూర్వకంగా ప్రధానితో భేటీ
- నేటి నుంచి హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా 2022 షో, నాలుగు రోజుల పాటు పలు రకాల విమానాల ప్రదర్శన
- శ్రీశైలంలో నేటి నుంచి స్పర్శ దర్శనం.. ఈ నెల 30 వరకు స్పర్శదర్శనానికి భక్తులకు అనుమతి
- అనంతపురం జిల్లా ఉరవకొండలోని ఎస్కే ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో నేటి నుంచి ప్రారంభంకానున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్.
- అనంతపురం జిల్లా కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి అశ్వవాహన సేవ.
- అనంతపురంలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఆర్ట్స్ కళాశాల మైదానంలో బాలోత్సవం కార్యక్రమం.
- ప్రపంచ క్షయ నివారణా దినోత్సవం సందర్భంగా విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి డీఎం అండ్ హెవో ఆఫీస్ వరకు నేడు అవగాహన ర్యాలీ.
- నేడు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో క్షయ వ్యాధి నివారణకు అవగాహనా ర్యాలీ
- శ్రీకాకుళంలో నేడు మెగాభిమనుల హెల్మెట్ అవగాహనా ర్యాలీ… ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ సందర్బంగా అరసవల్లి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బైక్ ర్యాలీ.
- యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణలో భాగంగా నేడు నాలుగో రోజు పంచకుండాత్మక యాగం.. ఉదయం శాంతి పాఠంతో ప్రారంభం, చతు:స్థానార్చన, మూలమంత్ర హావనములు, పంచ వింశతికలశస్నపనం, నిత్యలఘు పూర్ణాహుతి, సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, యాగశాలలో మూలమంత్ర హావనములు, చతు:స్థానర్చనలు, జలాధివాసం, నిత్య లఘు పూర్ణాహుతి.
- విశాఖ: ఋషికొండ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి సర్వదర్శనాలకు అనుమతి.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
