1. నేడు హైదరాబాద్ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,700లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,040లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 68,000లకు చేరింది.
2. తెలంగాణ ఆర్టీసీలో మరోసారి డీజిల్ సెస్‌ను పెంచారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో అదనపు డీజిల్ సెస్ వసూలు చేయనున్నారు. పల్లెవెలుగులో 250 కిలోమీటర్లకు రూ.5 నుంచి రూ.45కు పెంచారు.
3. నేడు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై రాజమండ్రి ఎస్సీ,ఎస్టీ కోర్టు విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ఈ నెల 20 వరకు రిమాండ్ పొడిగించిన కోర్టు.
4. నేడు ఢిల్లీలో బయోటెక్ స్టార్టప్ ఎక్స్‌పో-2022 ప్రారంభం కానుంది. అయితే ఈ ఎక్స్‌పోను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
5. నేడు ఎన్టీఆర్ జిల్లాలో మెగా శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకే, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలకు సీఎం జగన్ శంఖుస్థాపనలు చేయనున్నారు.
6. నేడు భారత్‌తో దక్షిణాఫ్రికా తొలి టీ20 జరుగనుంది. ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.