* నేడు అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవం.. ఉదయం 9.54 గంటలకు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. ప్రారంభోత్సవం తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు..
* నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. పలువురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం..
* నేడు మూడో రోజు హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన.. హిందూపురం మండలం కిరీకేర పంచాయతీ బసవనపల్లి ZPHS లో 64 లక్షల రూపాయల తో నిర్మించిన తరగతి గదుల భవనంను ప్రారంభోత్సవం.. పేద, మధ్య తరగతి ప్రజలకు ఒక వరం కూటమి ప్రభుత్వం అమలు చేసిన GST తగ్గింపు ర్యాలీలో పాల్గొననున్న బాలకృష్ణ..
* నేడు గుంటూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ, పాల్గొనున్న వైసీపీ నేతలు..
* నేడు చలో విజయవాడకు పిలుపునిచ్చిన విద్యుత్త్ JAC పిలుపు.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమైన సిబ్బంది.. ప్రభుత్వంతో పలు దఫాల చర్చలు జరిగినా రాని పరిష్కారం..
* నేటి నుంచి గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్.. విజయవాడలో ఈ నెల 19వ తేదీ వరకు షాపింగ్ ఫెస్టివల్.. తగ్గిన జీఎస్టీ వివరాలు వినియోగదారులకు తెలిసేలా, మోటర్ వాహనాల షోరూమ్స్ యజమానుల స్టాళ్లు..
* నేడు ఏపీలో పాఠశాలలకి కొత్త ఉపాధ్యాయులు.. ఇటీవల మెగా డీఎస్సీలో నియమితులైన కొత్త టీచర్లు.. అభ్యర్థుల సర్టిఫికేట్లు నకిలీవని తేలితే ఎంపిక రద్దవుతుందన్న విద్యాశాఖ..
* నేడు బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లాలని సీఎం నిర్ణయం..
* నేడు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశం.. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం.. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై పూర్తిస్థాయిలో వాదనలు వినిపించేందుకు సిద్ధం.. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి..
* నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నో నోటిఫికేషన్.. ఇవాళ్టి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ.. బైపోల్ ను సవాల్ గా తీసుకున్న అన్ని పార్టీలు.. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం.. జూబ్లీహిల్స్ మీద జెండా ఎగరేయాలని కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు..
* నేడు మేడారం పర్యటనకు మంత్రులు పొంగులేటి, సీతక్క.. మేడారం అభివృద్ధి పనులను పరిశీలించనున్న మంత్రులు..
* నేడు జూబ్లీహిల్స్ లోని రెహ్మత్ నగర్ లో బీఆర్ఎస్ సభ.. సభకు హాజరు కానున్న కేటీఆర్, హరీష్ రావు, ఇతర నేతలు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 29 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం..
* నేడు మహిళల వన్డే వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్.. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ వేదికగా మ్యాచ్..