✍ నేటి నుంచి ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ సంఘాల సమ్మె.. పీఆర్సీ అమలు సహా 71 డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన.. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్న ఉద్యోగులు
✍ ఏపీలో నేటి నుంచి ఏడాది పాటు గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించిన జగన్ సర్కారు
✍ 37వ రోజుకు చేరిన రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర… ఈరోజు నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ప్రారంభం… వల్లివేడు మీదుగా చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించనున్న పాదయాత్ర
✍ నల్గొండ జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన… టీఆర్ఎస్, స్థానిక సంస్థల అభ్యర్థులకు సంబంధించి ఓటర్లకు శిక్షణ ఇవ్వనున్న కేటీఆర్
✍ నిజామాబాద్ జిల్లాలో నేడు ఎమ్మెల్సీ కవిత బహిరంగ సభ… భీంగల్ మండల ఆఫీసు గ్రౌండ్‌లో సభ నిర్వహణ
✍ ఉత్తరప్రదేశ్: నేడు గోరఖ్‌పూర్‌లో ప్రధాని మోదీ పర్యటన… రూ.6,900 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ
✍ ఢిల్లీ: నేడు ఉదయం 9:30 గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
✍ ఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు బీజేపీలో చేరనున్న తీన్మార్ మల్లన్న
✍ ఢిల్లీ: నేడు కిసాన్ మోర్చా నేతల సమావేశం… భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న రైతు సంఘాలు