What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్. బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్. మార్చి 7వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
  • ఒంగోలు దిశ పోలీస్ స్టేషన్ లో దిశ కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రారంభించనున్న గుంటూరు రేంజ్ డీఐజీ సీ.యం.త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ మలిక గర్గ్
  • అన్నవరం దేవస్థానంలో అందుబాటులోకి వచ్చిన నిత్యాన్నదానం భోజనాల తయారీకి స్టీమ్ బాయిలర్లు
  • రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్ భేటీ
  • రైల్వే మరమ్మతుల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబద్ పరిధిలో 20 ఎంఎంటీఎస్ రైళ్ళు రద్దు
  • నేడు పుణెలో ప్రధాని మోడీ పర్యటన. పుణె మెట్రోరైల్ ను ప్రారంభించనున్న మోడీ.
  • శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఉత్సవాలు లో భాగంగా ఇవాళ స్వామి వారి ధ్వజావరోహణ కార్యక్రమం. సాయంత్రం స్వామి అమ్మ వార్లకు వసంతోత్సవం.
  • నేడు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. రాయలసీమ భవితవ్యంపై చర్చ