NTV Telugu Site icon

Heavy Demand For Pulasa Fish: యానాంలో ఆ పులస చేపకు యమా డిమాండ్

Pulasa 1

Pulasa 1

పులస చేప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుస్తెలమ్మి అయినా పులస చేప తినాలనేది గోదారోళ్ళ నానుడి. తాజాగా పులసచేపలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. యానాం లో గోదావరి పులస కి పుల్ డిమాండ్ తో వేలం పాట నిర్వహించారు. భారీవర్షాలు, గోదావరి వరదల కారణంగా ఈ మధ్య కాలం లో పులసలు దొరకక పోవడంతో తో పోటీ పడి వేలం పాట లో పాల్గొన్నారు పులస ప్రియులు. వేలం పాటలో చిన్నపులస చేప ఏకంగా 19 వేల రూపాయల రూపాయలు కి చిన్న పులస చేప అమ్మకం జరిగింది. ఈ పులస దొరికిన మత్స్యకారులు పండుగ చేసుకున్నారు. వేలంపాటలో భారీ ధరకు కొనుక్కున్న వ్యక్తి గర్వంగా పులసను తనతో తీసికెళ్లిపోయాడు.. అట్లుంటది మరి పులస చేపకు వున్న డిమాండ్. ఈ వేలం పాట వైరల్ అవుతోంది.

వర్షాకాలంలో మాత్రమే పులస చేప దొరుకుతుంది.. ఈ చేప చాలా రుచికరంగా ఉంటుంది. ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురు ఈదుతూ వస్తుంది. అందుకే అటు ఉప్పగా, ఇటు తియ్యగా కమ్మగా వుంటుంది. పులస చేప పులుసు పెడితే లొట్టలేసుకుతింటారు. రాజకీయనేతల్ని ప్రసన్నం చేసుకోవడానికి పులసను ఆయుధంగా వాడతారు. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి.

ఇవి గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోవడం, రెండురోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్‌ నుండి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి. సముద్రంలో ఉండే ఇలస.. గోదావరికి ఎదురీది ధవళేశ్వరం చేరేసరికి పులసగా మారే క్రమం ఈ నీటి మార్పు వల్లే జరుగుతుంది. పులస చేప కొనడానికి ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనుకాడరు.

ఈ చేపల రుచి చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి సైతం భోజన ప్రియులు తరలివస్తున్నారు. కాకినాడ, రాజమండ్రికి వచ్చే వారు అక్కడ పులస కొని పులుసు పెట్టుకుంటారు. హోటళ్ళవారు పులస చేపల పులుసు, ఇగురు వండి భోజన ప్రియులకు విందు చేస్తారు. వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ చేపలమార్కెట్లు కిటకిటలాడుతుంటాయి. పులస పేరు చెప్పగానే గోదావరి జిల్లాల్లో నోరూరని వారుండరంటే ఆశ్చర్యమే. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ చేపకు తూర్పు గోదావరి జిల్లా ఎంతో ఫేమస్‌. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో గోదావరిలో ఎర్రనీరు ఉన్నప్పుడే ఈ పులసలు ఎక్కువగా దొరుకుతాయి. అయితే వీటి ధర మాత్రం కాస్త ఎక్కువే. చిన్న సైజు చేప కొనాలంటే సుమారు నాలుగొందల నుంచి ఐదొందల వరకు ఉంటుంది. ఇక పెద్దసైజు చేప కొనాలంటే పదిహేనొందలు పెట్టాల్సిందే. దీనికి ఉన్న డిమాండ్‌ అలాంటిది. తాజాగా చిన్న పులస చేపను 19 వేలకు కొన్నారంటే దీని వైభవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Read Also: Viral News: లైంగిక సంతృప్తి కోసం వ్యక్తి దారుణం.. వాటర్ బాటిల్ దూర్చి..