Minister Dances Video Viral: భారీకాయం అడ్డు కాదు..! సాంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్న మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీకాయం ఉంటే.. కొందరు పది మందిలో కలవడానికి.. ఏదైనా సందర్భంలో ఆడటానికి పాడడానికి బిడియపడుతుంటారు.. భారీ శరీరం వాటికి అడ్డుకాకపోయినా.. వారిలో అది కేవలం తెలియని పీలింగ్ మాత్రమే కావొచ్చు.. అయితే, తాజాగా, ఓ మంత్రి సాంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్నారు.. నాగాలాండ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగాలాండ్ బీజేపీ చీఫ్, గిరిజన వ్యవహరాల మంత్రి టెంజెన్ ఇమ్నా.. తాజాగా, గిరిజనులతో కలిసి కాలు కదిపారు. భారీకాయాన్ని సైతం లెక్కచేయకుండా.. డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు.. ఆ రాష్ట్రంలో జరుపుకునే సుంగ్రెమాంగ్ పండుగలో పాల్గొన్న ఆయన.. వేడుకల్లోగిరిజనులతో కలిసి సాంప్రదాయక నృత్యాన్ చేశారు.. కొన్ని స్టెప్పులకు కాస్త ఇబ్బంది పడినా.. అదేమీ పట్టించుకోకుండా.. చిరునవ్వులు చిందిస్తూ.. కాలు కదిపారు.. అయితే, అక్కడున్న ఓ వ్యక్తి ఆ దృశ్యాలను మొబైల్‌లో బంధించగా.. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన మంత్రి టెంజెన్ ఇమ్నా అలోంగ్.. ‘చూడండి.. నేను కూడా డ్యాన్స్ చేయగలను.’ అని పేర్కొన్నారు. దీంతో, ఆ విడియో కాస్తా వైరల్‌గా మారిపోయింది.
Read Also: Amit Shah: మోదీ నాయకత్వంలో కొత్త భారత్ రూపుదిద్దుకోనుంది
Also Read
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
అంతకుముందు, తన పరివారంతో కలిసి నాగాలాండ్‌లోని ఉంగ్మా గ్రామానికి చేరుకున్న మంత్రి.. స్థానికులతో కలిసి అయో నాగా పండుగ సుంగ్రేమోంగ్ జరుపుకున్నారు.. సుంగ్రేమోంగ్ ఫెస్టివల్ వేడుకలో ఉంగ్మా విలేజ్ సభ్యుల నుండి లభించిన సాదర స్వాగతం చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. పండుగకు హాజరై వేడుకలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.. సుంగ్రేమోంగ్ సేలం!”, అని అలాంగ్ సోషల్ మీడియాలో రాశారు. సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించిన యువకులతో కాలు కదపమని కోరడంతో, అలోంగ్ సిగ్గుపడలేదు మరియు తన సామర్థ్యం మేరకు ప్రదర్శన ఇచ్చారు.. ఇక, ఈ పండుగనుద్దేశించి మాట్లాడుతూ.. నాగాలు.. పంటలు బాగా పండాలని జరుపుకునే పండుగ ఇది. సంస్కృతీ, సంప్రదాయాలకు నిలువుటద్దంగా ఈ ఫెస్టివల్ నిలుస్తుంది. నాగాలాండ్ సంస్కతిని చూడాలనుకునేవారు అక్కడికి వెళ్లండి అని సూచించారు.
See, I can dance too! 🕺 #Tsungremong– a festival of the Ao Nagas celebrated for invoking blessing of a bountiful harvest.
A rich heritage enthusiastically preserved and passed on to the younger generations.
Visit Nagaland to explore its culture & dance along with the locals. pic.twitter.com/zPbqBDgZPD
— Temjen Imna Along (@AlongImna) August 1, 2022
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!