అంతర్వేదిలో మత్స్యకారులకు అప్పుడప్పుడూ పంట పండుతుంటుంది. సాగరమాత వారికి ఇలా వరాలు ఇస్తూ వుంటుంది. వారి వలలో పడే చేపలు వారికి భారీగా ఆదాయం తెచ్చిపెడుతుంటాయి. వారి కుటుంబానికి ఆధరువు అవుతాయి. తూర్పుగోదావరి సఖినేటిపల్లి మండలం అంతర్వేది సాగర సంగమం వద్ద వశిష్ట గోదావరి నదిలో స్థానిక మత్స్యకారుల వలలో 28 కిలోల మగ కచ్చిడి చేప చిక్కింది. ఇంత భారీ చేప దొరకడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి అని మత్స్యకారుడు ఆనందం వ్యక్తం చేశాడు.…