Sajjal Ramakrishna Reddy: వైసీపీ ముఖ్యనేతలతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ, రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల ముందు వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అలాగే, పార్టీ కమిటీల నిర్మాణం, సంస్థాగతంగా బలోపేతం చేయడంపై నాయకులంతా సీరియస్‌గా దృష్టి సారించాలి.. కమిటీల నిర్మాణం, మైక్రో లెవల్ ప్లానింగ్‌పై మనం పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాలి అని సూచించారు. సెంట్రలైజ్డ్ డేటా ప్రొఫైలింగ్ కేంద్ర కార్యాలయం నుంచి జరుగుతుంది అన్నారు. నిబద్దతతో, చురుగ్గా పని చేసే వారిని గుర్తించి కమిటీలలో ప్రాధాన్యతం ఇవ్వాలని సజ్జల సూచించారు.
Read Also: Pakistan Gifts Turkiye: తుర్కియేకి పాక్ గిఫ్ట్.. వెయ్యి ఎకరాల భూమి ఉచితం..
ఇక, పుంగనూరు, మడకశిర నియోజకవర్గాలలో పైలెట్ ప్రాజెక్ట్‌గా గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్ధాయి వరకు కమిటీలను నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకు రావడం జరిగింది అని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఇటీవల పుంగనూరులో జరిగిన సమావేశం చాలా మంచి వాతావరణంలో జరిగింది.. క్రియాశీలకంగా ఉండే ముఖ్యమైన నాయకులంతా కసరత్తు చేసి ఈ కమిటీలను నియమించుకున్నారు.. కమిటీల నిర్మాణం ఎంత ముఖ్యమో దానికి సంబంధించిన స్ట్రక్చర్ కూడా అంతే ముఖ్యం అన్నారు. పని చేయాలనుకునే వారిని అందరినీ గుర్తించడం, వారికి తగిన ప్రాధాన్యతనివ్వడం మనం చేయాల్సిన పని.. ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గాలను ఒక్క యూనిట్ గా తీసుకోవాలి అన్నారు. ఇలా నెట్‌వర్క్ రూపొందించి ఒక్కో నియోజకవర్గం నుంచి 8 వేల మందిని ఈ సిస్టమ్ లోకి తీసుకురావాలని రామకృష్ణా రెడ్డి వెల్లడించారు.
Read Also: Student: హోం వర్క్ చేయలేదని.. 2వ తరగతి విద్యార్థిని తలక్రిందులుగా వేలాడదీసి కొట్టిన వైనం..
అయితే, సంక్రాంతి నాటికి అందరికీ పార్టీ గుర్తింపు కార్డులు అందజేసేలా కార్యాచరణ రూపొందిస్తామని సజ్జల పేర్కొన్నారు. అన్ని స్థాయిల నాయకత్వం సమన్వయంతో పని చేయాలి.. ఇందుకు అవసరమైన వర్క్‌షాప్‌లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీకి సంబంధించిన ఐటీ, సోషల్ మీడియా వింగ్స్ సహకారం తీసుకుని ముందుకెళ్లాలి.. పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మండల స్థాయిలో 15, గ్రామ స్థాయిలో 7 కమిటీల నియామకం పక్కాగా జరగాలి అని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలియజేశారు.