Cockfighting: పల్లెలకు అప్పుడే సంక్రాంతి శోభ వచ్చేస్తోంది.. సెలవులు రావడంతో.. ఉన్న పట్టణాన్ని వదిలి.. సొంత ఊళ్లకు పయనం అవుతున్నారు.. మరోవైపు.. పందాల పండుగకు రంగం సిద్దమవుతుంది. నెలల తరబడి చంటిబిడ్డల్లా సాకిన పందెం పుంజులను బరిలో దించేందుకు ముహూర్తం దగ్గర పడటంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి అతిధులు ఇప్పటికే గ్రామాలకు చేరుకుంటున్నారు.. వీరితో పాటు పందాలపై మోజున్న జూదగాళ్ళంతా గోదావరి బాట పట్టారు. పెద్ద మొత్తంలో పందేలు కాసేందుకు సై అంటే సై అంటున్నారు.. ఇదే సమయంలో కూటమి నేతల మద్య పందాల నిర్వాహణ పోటి పెంచుతోంది. దేశవిదేశాల నుంచి అతిధులు తరలివచ్చే సమయం కావడంతో పందెం బరుల నిర్వాహణ ఇపుడు ప్రెస్టీజియస్‌గా మారిపోయింది. దీంతో ఒకరిని మించి మరోకరు పందాల నిర్వాహణపై ఫోకస్ పెట్టారు. గతంలో చిన్న చిన్న బరులే ఉండే ప్రాంతంలో ఇపుడు పెద్దపెద్ద స్టేడియాలను తలపించే విధంగా రంగం సిద్దమవుతుంది.
Read Also: Donald Trump: “పుతిన్ నన్ను కలవాలనుకుంటున్నారు”.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
గతంలో కంటే ఇపుడు పందాల జోరు సోషల్ మీడియాలో సైతం హల్ చల్ చేయడంతో గోదావరిజిల్లాలకు పందెం రాయుళ్ళ రాక పెరగబోతున్నట్టు అంచనా.. గతంలో కేవలం జిల్లాకు సంబందించిన వారు.. సొంతూళ్ళకు వచ్చిన వారే ఎక్కువ పందాలు ఆడటానికి చూడటానికి వచ్చేవారు.. ఇపుడు సీన్ మారుతోంది. ప్రధాన ప్రాంతాల్లో రెండు మూడు బరులు నిర్వహించేందుకు సన్నా హాలు చేస్తున్నారు. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు భారీ ఎల్.ఈ.డి స్క్రీన్లు, ప్రత్యేక ఆఫర్లతో పాటు పెద్ద ఎత్తున వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే పందెంరాయుళ్ళ కోసం ఇప్పటికే ఈ నిర్వాహకులు రూమ్‌లన్ని బుక్ చేసేశారు. బరిలతోపాటు వేదికలు, కార్ పార్కింగ్‌కు కూడా ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాయుకుల మద్య పోటితో పెద్ద బరులు సిద్దమవుతున్న వేళ చిన్న బరులకు పందేంరాయుళ్లు వస్తారా లేదా అన్న సందేహం నిర్వాహకుల్లో మొదలయ్యాయి. ఇప్పటికే పందాల నిర్వాహణకు స్థానిక నేతలకు ఎంతో కొంత ముట్టజెప్పిన చోటామోటా నిర్వాహకులుసైతం భారీ ఏర్పాట్లపై దృష్టిపెట్టారు.
Read Also: Greenland: గ్రీన్‌ల్యాండ్‌ని కొనేందుకు ట్రంప్ ప్లాన్.. వాస్తవానికి ఆ ద్వీపం ఏ దేశానికి చెందినదంటే ?
భీమవరం, ఉండి ప్రాంతాల్లో మహిళల కోసం కొన్ని బరుల వద్ద ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు.. ఇతర రాష్ట్రాల నుంచి ప్రాంతాల నుంచి వచ్చే గెస్టులకు ఆడియన్స్‌కు బస చేసేందుకు తాత్కాలికంగా వసతులను సైతం ఏర్పాటు చేశారు. విఐపిలకోసం క్యారవాన్లను కూడా అందుబాటులో ఉంచబోతున్నట్టు సమాచారం.. బరులకు సమీపంలోని భవనాలను ఇప్పటికే అద్దెలకు తీసుకున్నట్టు సమాచారం..కోడిపందేలు మాత్రమే కాకుండా పేకాట, గుండాట, చిత్తులాట, కోత ముక్క తదితర జూదాలను ఆడేందుకు ఏర్పాట్లలో తగ్గేదే లేదంటున్నారు నిర్వాహకులు.. ఇప్పటికే పందెం పుంజులను వస్తాదుల్లా తయారు చేసిన పందెం రాయుళ్లు పండుగ రోజున తమ ప్రతాపం చూపించబోతున్నారు. నాయకుల మద్య పోటి ఇపుడు పందెం రాయుళ్లకు ఓరకంగా కలిసొస్తుందనే చెప్పాలి. భారీ ఏర్పాట్ల మద్య తమ పుంజులను బరిలో దించి విజయంతో బయటికి రావాలనే ఆశతో ఉన్నారు. ఇంతటి ఏర్పాట్ల మద్య పందెం ఓడితే పరువు పోతుందనే ఆందోళణలోనూ ఉన్నారు. అందుకే బరిలో దిగబోయే పుంజులను మరింత శ్రద్దగా చూసుకోవడంపై దృష్టిపెట్టారు పందెం రాయుళ్లు.. మొత్తానికి ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లాలో ఈసారి పందాల జోరు తగ్గేదేలేదనండంలో సందేహమే లేదు..