Dowleswaram Barrage: రాజమండ్రి దగ్గర గోదావరి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. నిన్న ( సెప్టెంబర్ 27న) అమాంతంగా నీటి మట్టం పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక వద్దకు గోదావరి వరద ప్రవాహం చేరుకుంది.
Read Also: TVK Vijay: టీవీకే చీఫ్ విజయ్ బస్సు కింద పడిన నలుగురు.. తీవ్రస్థాయిలో విమర్శలు!
ఇక, రాజమండ్రి పుష్కర ఘాట్ లో ఇద్దరు భవానీ భక్తులు గోదావరిలో గల్లంతు అయ్యారు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో ముందస్తుగా ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పుష్కర్ ఘాట్ లో పోలీస్ బందోబస్తు లేకపోవడంతో పాటు లోతును అంచనా వేయలేక గుబ్బల బాపిరాజు, రాయడు వీరబాబు గోదావరిలో గల్లంతు అయ్యారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బ్యారేజ్ దిగువన వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి ఉప నదులు పొంగిపొర్లుతున్నాయి.
Read Also: Nep vs WI: పరువంతపాయె.. రెండు సార్లు వరల్డ్ కప్ గెలిచిన జట్టుపై పసికూన గెలుపు
గోదావరి ఉప నదుల వరద ఉధృతితో కోనసీమ లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మొదటి ప్రమాద హెచ్చరిక ఇవాళ రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత వరద ప్రవాహం తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంది.