Site icon NTV Telugu

Cyber Crime: భారీ సైబర్ క్రైమ్ ఛేదించిన భీమవరం పోలీసులు.. ఐదుగురు అరెస్టు!

Cyber

Cyber

Cyber Crime: పశ్చిమ గోదావరి జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు దోచుకున్న గ్యాంగ్‌ను భీమవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన ఐదుగురు సభ్యుల ఈ ముఠా, ఆధునిక సైబర్ ట్రిక్స్‌తో ప్రజలను మోసగిస్తూ భారీ మొత్తంలో డబ్బును దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక, విచారణలో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సైబర్ క్రైమ్ ముఠా సభ్యులు ఉద్యోగాల కోసం కంబోడియా వెళ్లి, అక్కడ ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పద్ధతులపై ట్రైనింగ్ తీసుకుని.. అనంతరం భారత్‌కు వచ్చి, ఆన్‌లైన్ మోసాలకు పాల్పడినట్లు తేలింది. బ్యాంక్ OTP ఫ్రాడ్స్, KYC అప్‌డేట్ పేరుతో మోసాలు, సోషల్ మీడియా హ్యాకింగ్‌ ద్వారా నగదు దోచుకోవడం లాంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also: Stock Market: మార్కెట్‌కు కొత్త జోష్.. ఆల్‌ టైమ్ రికార్డ్ సృష్టించిన నిఫ్టీ

అయితే, ఈ ముఠా సైబర్ నేరాల ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ. 50 లక్షల రూపాయలను రికవరీ చేసినట్లు సమాచారం. నిందితుల దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ల్యాప్‌టాప్‌లు, డిజిటల్ వాలెట్ వివరాలను హస్తగతం చేసుకున్నారు పోలీసులు.. అలాగే, ఈ కేసులో ఎవరెవరూ ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ నయూమ్ ఆస్మి మీడియాతో మాట్లాడుతూ.. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని లింకులు క్లిక్ చేయకూడదు, బ్యాంక్ OTP లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకూడదని హెచ్చరించింది.

Exit mobile version