NTV Telugu Site icon

Minister Bosta: మేము ఉద్యోగస్తులకు వ్యతిరేకం కాదు..

Bosta 1

Bosta 1

తాము ఉద్యోగస్తులకు వ్యతిరేకం కాదని అన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీ అయినా.. మున్సిపల్ కార్మికుడు అయినా ఉపాధ్యాయుడు అయినా అందరూ ఒక్కటేనని తెలిపారు. ఐదో తేదీ నుండి గర్భిణీలకు, బాలింతలకు వైయస్సార్ కిట్లును ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. అంగన్వాడీలు 11 సమస్యలు తమ ముందు ఉంచారని.. అందులో 10 సమస్యలకు ఒప్పుకున్నామని తెలిపారు. మిగతా ఒకటి జీతాన్ని పెంపుదల చేయాలని అన్నారు. ఎన్నికల ముందు పెంపుదల చేయడం భావ్యం కాదని చెప్పామన్నారు. నాలుగు నెలలు తర్వాత తమ ప్రభుత్వం వస్తుందనీ తమకు నమ్మకం ఉందన్నారు. జగన్ మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Bhatti Vikramarka : తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని ఈ విధంగా తీర్చుకోవాలి

ఆ తరవాత కూర్చుని చర్చించి మీకు ఏది కావాల్సితే అది చేస్తామని చెప్పామన్నారు మంత్రి. కాదు.. మాకు ఇప్పుడే చేయాలి అంటే అది చాలా తప్పు అని అన్నారు. ఐదేళ్ల ప్రభుత్వంలో జీతాలు పెంపు గురించి ఒకసారి మాత్రమే చూస్తది అని తెలిపారు. ప్రతి రెండు ఏళ్లు, మూడు ఏళ్లకు చూడాలి అంటే అది ధర్మం కాదని పేర్కొన్నారు. ఎంత ఇచ్చినా సరిపోదు.. కానీ మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని కోరామన్నారు. తామేమీ వ్యతిరేకం కాదు.. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని మంత్రి చెప్పారు.

Kargil Night Landing: చరిత్ర సృష్టించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. కార్గిల్‌లో C130-J విమానం నైట్ ల్యాండింగ్.. ఎందుకంత ప్రత్యేకం..

మున్సిపల్ కార్మికులు చెప్పిందల్లా చేశాం.. స్కవెంజర్స్ కి రూ.21 వేలు చేశామన్నారు మంత్రి బొత్స. తాము చెప్పింది వారు చేయాలని అన్నారు. అంతేగాని ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. ప్రతిపక్ష, కమ్యునిస్ట్ పార్టీలు చెప్పినట్టు చేస్తాం అంటే అది భావ్యం కాదని తెలిపారు. సిద్ధాంతాలు, రాజకీయాలు తర్వాత చూసుకుందాం.. కానీ ప్రజలు తాలూకా ఆరోగ్యంతో, ప్రజా కార్యక్రమాలు మీద ఇలా చేయడం భావ్యం కాదని చెప్పారు. ఇలా చేస్తే ప్రజలు భావించరు కాబట్టి వెంటనే నిరసనలు విరమించుకుని విధుల్లో చేరండి అని చెప్పామన్నారు. ఎన్నికలు అయినా తర్వాత కుర్చుని మాట్లాడుకుందామని చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు.