Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Diarrhea Which Was Under Control In Gurla The Disease Is Prevalent Due To Drinking Water Pollution

Vizianagaram: గుర్ల‌లో అదుపులోకొచ్చిన డ‌యేరియా.. తాగునీటి కాలుష్యం వల్లే వ్యాధి

Published Date :October 20, 2024 , 9:05 pm
By Rajesh Veeramalla
  • విజ‌య‌న‌గ‌రం జిల్లా గుర్ల‌లో అదుపులోకొచ్చిన డ‌యేరియా
  • ఈనెల 13 నుండి 15వ‌ర‌కు పెరిగిన డ‌యేరియా కేసులు
  • గ‌త నాలుగు రోజులుగా కేసుల న‌మోదులో భారీ తగ్గుద‌ల‌
  • శ‌నివారం నాడు న‌మోద‌య్యింది ఒక్క కేసు మాత్ర‌మే
  • డ‌యేరియా వ‌ల్ల మ‌ర‌ణించింది ఒక్క‌రే అని నివేదిక‌.
Vizianagaram: గుర్ల‌లో అదుపులోకొచ్చిన డ‌యేరియా.. తాగునీటి కాలుష్యం వల్లే వ్యాధి
  • Follow Us :
  • google news
  • dailyhunt

వైద్య ఆరోగ్య శాఖ‌, స్థానిక వైద్య సిబ్బంది ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవడం వ‌ల్ల విజ‌య‌నగ‌రం జిల్లా గుర్ల‌లో డ‌యేరియా అదుపులోకొచ్చింద‌ని ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కృష్ణ‌బాబు తెలిపారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి ఆయ‌న వివ‌రాల‌ను అందించారు. వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశాల మేర‌కు.. డ‌యేరియా ప్ర‌బ‌లిన వెంట‌నే ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ప‌ద్మావ‌తిని విజ‌య‌న‌గ‌రం జిల్లాకు పంపించామ‌న్నారు. ఆమె అక్క‌డే ఉండి ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. స్థానిక వైద్యులతో ప్ర‌త్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, డ‌యేరియా వ్యాప్తికి గ‌ల కార‌ణాల‌పై అధ్య‌య‌నం చేసి స‌మ‌గ్ర నివేదిక‌ను అంద‌జేసిందని తెలిపారు. ఆ గ్రామంలో తాగునీటి న‌మూనాల‌ను ప్ర‌యోగ‌శాల‌కు పంపించ‌గా.. క‌లుషిత‌మైన‌ట్లు తేలింద‌ని కృష్ణబాబు చెప్పారు. ఆ ప్రాంతంలో ప్ర‌జ‌లు బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న చేయ‌డం వ‌ల్ల భూగ‌ర్భ జ‌లం క‌లుషిత‌మ‌య్యింద‌ని.. నీటిని స‌ర‌ఫ‌రా చేసే పైపులు డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌లో ఉండ‌డం వ‌ల్ల లీకేజీ వ‌ల‌న కూడా తాగునీరు క‌లుషిత‌మ‌య్యింద‌ని స్థానిక అధికారులు వివ‌రించారు.

Unstoppable 4 -NBK: అన్‌స్టాపబుల్‌ సీజన్ ఫోర్‌లో ఫస్ట్ గెస్ట్‌గా సీఎం చంద్రబాబు.. ప్రసారం ఎప్పుడంటే?

డీహైడ్రేష‌న్ బాగా ఉన్న డ‌యేరియా కేసుల్ని చీపురుప‌ల్లి సిహెచ్ సికి, విజ‌య‌న‌గరం జిజిహెచ్, వైజాగ్ కేజిహెచ్ ల‌కు త‌ర‌లించార‌ని.. ఇంటింటికీ స‌ర్వే చేసి అనుమానిత కేసుల్ని ఉచిత వైద్య శిబిరాల‌కు తీసుకొచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకున్నార‌ని కృష్ణ‌బాబు పేర్కొన్నారు. ప‌బ్లిక్ హెల్త్ స్పెష‌లిస్టు, ఎపిడిమాల‌జిస్ట్, మైక్రోబ‌యాల‌జీ, క‌మ్యూనిటీ మెడిసిన్ నిపుణుల‌తో ప్ర‌త్యేక బృందం ఏర్పాటు చేసి ఆప్రాంతంలో స‌మ‌గ్ర స‌ర్వే చేసి నివేదిక‌ను పంపించాల‌ని కృష్ణ‌బాబు ఆదేశించారు. నీరు క‌లుషితం కాకుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌కు సూచించారు. ప్ర‌జ‌ల‌కు ట్యాంక‌ర్ల ద్వారా సుర‌క్షిత‌మైన నీరు అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు.

Sanjay Raut: మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ‘‘రాష్ట్రపతి పాలన’’.. అమిత్ షాపై సంచలన ఆరోపణలు..

ఈనెల 13న ఒక కేసుతో డయేరియా కేసులు మొద‌లు కాగా.. 14న 55 కేసులు, 15న 65 కేసులు న‌మోద‌య్యాయి. 16న 40 కేసులు, 17న 32 కేసులు, 18న 8 కేసులు న‌మోదుతో కేసులు తగ్గుముఖం ప‌ట్టాయి. శ‌నివారం నాడు ఒక్క‌ కేసే న‌మోద‌య్యింది. 53 మంది ప్ర‌స్తుతం చికిత్స పొందుతుండ‌గా.. వారిలో గుర్ల జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్లో 17 మంది, వైజాగ్ కేజీహెచ్‌, జీజీహెచ్ విజ‌య‌న‌గ‌రం, ఘోషా ఆసుప‌త్రి, సీహెచ్‌సీ చీపురుప‌ల్లిల‌లో 36 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు గుర్లలో డ‌యేరియా వ్యాధి వ‌ల్ల చ‌నిపోయిన వారి సంఖ్య గురించి వివిధ ర‌కాల వార్త‌లొస్తున్నాయ‌ని.. కానీ వాస్త‌వంగా గుర్ల మండ‌లంలో డ‌యేరియా వ‌ల‌న ఒక్క‌రు మాత్ర‌మే చ‌నిపోయార‌ని ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ తెలిపారు. ఏడుగురు ఇత‌ర వ్యాధుల‌తో మ‌ర‌ణించార‌ని.. స్థానికంగా ప‌రిస్థితుల్ని ప‌ర్య‌వేక్షిస్తున్న ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ప‌ద్మావ‌తి ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి. కృష్ణ‌బాబుకు నివేదిక పంపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • diarrhea
  • Drinking Water
  • Gurla
  • pollution
  • Vizianagaram

తాజావార్తలు

  • NTRNeel : డ్రాగన్’లో ధురంధర్’ నటుడు కీలక పాత్ర

  • Actress Hema: నటి హేమకు మరోసారి డ్రగ్స్ టెస్ట్.. రిపోర్టులో ఏం తేలిందంటే..?

  • Pub Drugs Raid: పబ్ లో ‘ఈగల్ టీం’ మెరుపు దాడులు.. ఎనిమిది మందికి డ్రగ్స్ పాజిటివ్..!

  • Kitchen Tips: మాడిన గిన్నెలను నిమిషాల్లో కొత్త దానిలా మెరిపించే సింపుల్ చిట్కాలు ఇవే!

  • CM Revanth: తెలంగాణను దక్షిణ ఆసియా టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చుదిద్దుతాం..

ట్రెండింగ్‌

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions