వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.. గుర్లకు వెళ్లనున్న ఆయన.. డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను, డయేరియా బాధితులను పరామర్శించనున్నారు. ఇక, విజయనగరం జిల్లా పర్యటనకు ఈ రోజు ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరనున్న జగన్.. ఉదయం 11 గంటల ప్రాంతంలో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్నారు..
విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. గుర్ల తాగునీటి పథకాన్ని పరిశీలించడంతో పాటు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఉపముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడారు. డయేరియా వ్యాప్తి కారణాలపై కలెక్టర్‌తో సమీక్షించారు.
వైద్య ఆరోగ్య శాఖ, స్థానిక వైద్య సిబ్బంది పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్ల విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా అదుపులోకొచ్చిందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆయన వివరాలతో కూడిన సమాచారం అందించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు డయేరియా ప్రబలిన వెంటనే పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతిని విజయనగరం జిల్లాకు హుటాహుటిన పంపించామనీ, అక్కడే ఉండి పరిస్థితిని ఆమె…