Travels Bus Caught Fire: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. పూర్తిగా దగ్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Travels Bus Caught Fire: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రమాదాలు ఆగడం లేదు.. విజయనగరం జిల్లా రామభద్రపురం, సాలూరు మధ్య రహదారిపై తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్ నుంచి జైపూర్ వెళ్తున్న ఆరంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. డ్రైవర్ దశరథ్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును వెంటనే ఆపడంతో ప్రయాణికులు అందరూ సురక్షితంగా దిగిపోయారు. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ, ఎవరికి గాయాలు కాలేదు. ఈ బస్సులో ఒడిశాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: Iranian oil: ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా.. ఏప్రిల్ 19 వరకు అమలు..
Also Read
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Ramateertham incident: రామతీర్థం ఘటనలో కీలక పరిణామం.. ధ్వంసమైన విగ్రహాలు నేడు నిమజ్జనం..
- Vizianagaram Incident: యువకుడి వికృత చేష్టలు.. నిండు గర్భిణీ ఇంటి ముందు అసభ్య ప్రవర్తన..!
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!