Botsa Satyanarayana: మెడికల్ కాలేజ్ కోటి సంతకాలపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి వ్యాఖ్యలను ప్రజలు గమనించాలి అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. అసలు రాష్ట్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో ఈ మంత్రికి తెలుసా?.. ఏ గ్రామానికైనా వెళ్ళి క్రాస్ చెక్ చేసుకున్నా IVRS సర్వే చేస్తే ప్రజల అభిప్రాయం ఏంటో మంత్రికి అర్థం అవుతుందన్నారు. చిల్లర మాటలు మాట్లాడి స్థాయి దిగజార్చుకోవద్దని సూచించారు. PPP ద్వారా అవినీతికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు ఉంటాయి.. అది మా పార్టీ విధానమని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బెదిరింపులు అనడం ఏంటి.. స్వార్ధం కోసం పీపీపీల ద్వారా లబ్ధి పొందిన వాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామని బొత్స వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Jagapathi Babu : పెళ్లి వీడియో తో షాక్ ఇచ్చిన జగపతి బాబు.. వీడియో వైరల్
ఇక, చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు పేదలు అవసరం లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన కార్పొరేటర్ల తలంపే.. మరి ప్రశ్నిస్థామన్న పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. పీపీపీ అక్రమాలపై చర్యలు ఉంటాయంటే బెదిరిస్తున్నారని కామెంట్స్ చేస్తారు.. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని జ్యోతిష్యం చెబుతున్నారు.. అంతే కానీ రాష్ట్రంలో అవినీతి మాత్రం పవన్ కు కనిపించడం లేదని తెలిపారు.
Read Also: Pak U-19 Team Meet Army Chief: పాక్ ఆర్మీ చీఫ్ని కలిసిన అండర్-19 టీం.. ప్రధాని షరీఫ్ ఉత్తితేనా..?
ఇక, పీకుడు భాష డైలాగులకు పనికి వస్తాయి తప్ప ప్రజలకు ఉపయోగపడవని ఎమ్మెల్సీ బొత్స తెలిపారు. చేవ, సత్తా ఉన్న వాళ్ళు మాటలు తక్కువ చేతలు ఎక్కువగ ఉంటాయి.. అది లేనప్పుడే మాటలు ఎక్కువవుతాయని విమర్శించారు. ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న అభిప్రాయాలను సీఎం, మంత్రులు తెలుసుకుంటే వాస్తవ పరిస్థితులు బోధపడతాయి.. సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని రోడ్లు గోతులు కప్పేయాలని చెప్పిన ముఖ్యమంత్రి.. అది ఏ సంవత్సరంలో మాత్రం చెప్పలేదు.. నిధులిస్తే గోతులు కప్పుతారు.. మాటలు చెబితే కాదన్నారు. రాజకీయాల్లో తూలనాడటం మంచి సాంప్రదాయం కాదు.. సంయమనం పాటించడం మంచిది అన్నారు. నేను లేగిస్తే మనిషిని కాదంటున్న వాళ్ళు లేగిస్తే ఏం అవుతుంది? అని ప్రశ్నించారు. సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మారు వేషాల్లో వెళ్ళి పరిశీలిస్తే ప్రజల సమస్యలు అర్ధమవుతాయని సత్యనారాయణ వెల్లడించారు.
Read Also: CM Chandrababu: ఐటీని ప్రమోట్ చేయడంలో సక్సెస్ అయ్యాను.. అప్పుడు మైక్రోసాఫ్ట్- ఇప్పుడు గూగుల్!
కాగా, ఈ ప్రభుత్వం టోట ల్లీ ఫెయిల్యూర్ అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద పనులు నిలిపివేస్తూ సర్క్యులర్ ఇవ్వడం చూస్తేనే ఈ ప్రభుత్వం పని తీరు.. వ్యవస్థ మీద పట్టలేదని తేలిపోయింది.. ఉత్తర్వులు ఇచ్చిన, కామెంట్స్ చేసిన ఒక వేలు మమ్మల్ని చూపిస్తే మూడు వేళ్ళు మిమ్మల్ని చూపిస్తున్నాయని తెలిపారు. పవర్ పార్చెజ్ అగ్రిమెంట్ల మీద గగ్గోలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు 3 రూపాయలకు యూనిట్ ఎలా కొంటున్నారని ప్రశ్నించారు. యోగి ఆదిత్య నాథ్ తరహా ట్రీట్మెంట్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఇవ్వమని సలహాలు ఇస్తున్నారు.. మేయర్ అవిశ్వాస తీర్మానంలో రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తాం.. ప్రభుత్వ నిర్ణయాలకు తలొగ్గి చర్యలు తీసుకోలేదు.. న్యాయ స్థానం ద్వారా చర్యల కోసం పోరాటం చేస్తామని బొత్స తెలియజేశారు.