Farmers vs Police: విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం బైరెడ్డి పాలెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో రైతుల ఇళ్ల తొలగింపు తీవ్ర గందరగోళానికి దారి తీసింది. బలవంతంగా తమ ఇల్లులను పోలీసు బందోబస్తుతో వచ్చి కూల్చివేయ్యడాన్ని రైతులు నిరసిస్తున్నారు. ఎయిర్ పోర్టు అప్రోచ్ రోడ్డుకు భూములు తీసుకున్నా.. ఇప్పటి వరకు తమకు డబ్బులు ఇవ్వలేదు అంటూ ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొడుతున్నారు. ఇక, నిరసన చేస్తున్న వారిని అక్కడి నుంచి ఈడ్చుకెళ్తున్నారు.
Read Also: Pawan Kalyan: డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు.. ఆఖరి శ్వాస వరకు..!
అయితే, సంక్రాంతి పండగ వరకు సమయం ఇవ్వండి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ, కోర్టు ఆర్డర్ ప్రకారంగానే ఇళ్లను తొలగిస్తున్నామని అధికారులు వెల్లడించారు. రైతులు కోర్టును ఆశ్రయించడంతో.. వారి నష్ట పరిహారాన్ని కోర్టులో జమ చేసినట్లు ఎయిర్ పోర్టు అథారిటీ సిబ్బంది చెబుతున్నారు.