Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
- పాక్ మహిళా ఏజెంట్ వలలో చిక్కిన నేవీ సైలర్
- రహస్య సమాచారం చేరవేశాడన్న ఆరోపణలతో అరెస్ట్
- ఐఎన్ఎస్ అగ్రానిలో శిక్షణ పొందుతుండగా అదుపులోకి
- మొబైల్, ల్యాప్‌టాప్ స్వాధీనం.. లోతుగా దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత నావికాదళానికి చెందిన అత్యంత సున్నితమైన రక్షణ రహస్యాలను పాకిస్తానీ గూఢచారికి చేరవేస్తున్నాడనే తీవ్ర ఆరోపణలతో విశాఖపట్నం ఈస్టర్న్ నావల్ కమాండ్‌కు చెందిన నేవీ అధికారి (సైలర్) అరెస్టయ్యాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 31 ఏళ్ల ప్రదీప్ ముఖర్జీ 2014లో భారత నౌకాదళంలో చేరి, ప్రస్తుతం వైజాగ్ కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొద్ది నెలల క్రితం సోషల్ మీడియా వేదికగా ఒక పాకిస్తానీ మహిళా ఏజెంట్ ఇతనికి పరిచయమైంది. ఆ పరిచయాన్ని హనీట్రాప్‌గా మార్చుకున్న ఆ గూఢచారి, ప్రదీప్‌ను తన వలలో వేసుకుంది. ఈ క్రమంలోనే విశాఖ నావికా స్థావరానికి సంబంధించిన కీలక సమాచారం, యుద్ధనౌకల కదలికలు, నావికాదళ కార్యకలాపాల వివరాలను అతడు ఆ పాక్ ఏజెంట్‌కు చేరవేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
ఐఎన్ఎస్ అగ్రాని వద్ద రంగంలోకి దిగిన కౌంటర్ ఇంటెలిజెన్స్
ఇటీవలే తమిళనాడులోని కోయంబత్తూరు రెడ్ ఫీల్డ్స్‌లో ఉన్న ఐఎన్ఎస్ అగ్రాని శిక్షణ కేంద్రానికి ప్రదీప్ ముఖర్జీ చేరుకున్నాడు. అక్కడ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కోర్సులో శిక్షణ పొందుతుండగా, అతని డిజిటల్ కదలికలలో అనుమానాస్పద ఆనవాళ్లను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. పక్కా సమాచారంతో నిఘా పెంచిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు, నౌకాదళ ఉన్నతాధికారుల అనుమతితో కోయంబత్తూరులోని ఐఎన్ఎస్ అగ్రాని ప్రాంగణంలోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
విజయవాడకు తరలింపు.. లోతైన విచారణ
అరెస్టు అనంతరం నిందితుడిని స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పొందిన అధికారులు, తదుపరి విచారణ నిమిత్తం విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అతడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. దేశ రక్షణకు సంబంధించిన ఎంతవరకు సమాచారం లీక్ అయింది, ఈ కుట్రలో ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?