VishnuVardhan Reddy: మీది అవినీతి ఎజెండా.. మాది అభివృద్ధి ఎజెండా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ మంత్రులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో రాష్ట్ర ప్రజలకు అర్ధమైందన్నారు ఏపీ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విషువర్ధన్ రెడ్డి. నడ్డా పర్యటన తరువాత వైసీపీ నిజ స్వరూపం బయట పడింది. ఏపీలో ఇసుక, భూ, మధ్యం, మైనింగ్ మాఫియా జరుగుతుందన్న నడ్డా ఆరోపణలు నిజం కాదా? దేశంలోనే మద్యం ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ.
మూడేళ్లలో ఏపీ అభివృద్ధి చెందలేదు… వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయింది. కేంద్రం ఇచ్చిన నిధులు వాడుకొని లబ్ధిదారులకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు. జగన్ అన్న కాలనీలో ఎక్కడ ఇండ్లు కట్టారో వైసీపీ నేతలు చెప్పాలి. కేంద్రం రాష్ట్రానికి ఏమీ ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు… ఎయిమ్స్ ఎక్కడి నుంచి వచ్చిందన్నారు విష్ణు వర్థన్ రెడ్డి.
Also Read
ఐఐటీ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్, జాతీయ రహదారులు కేంద్రం ఇచ్చింది కనపడటం లేదా? ఏపీలో జాతీయ రహదారులు తప్పితే రాష్ట్ర రహదారులు లేవు. జేపి. నడ్డాపై వ్యక్తిగత దూషణలు చేయడం సిగ్గుచేటు. నడ్డా అడ్డు, పొడుగు గురించి మాట్లాడే స్థాయి మీది. బీజేపీ ముందు మీ బలం ఎంత? దేశంలో రెండే మతతత్వ పార్టీలు ఉన్నాయి ఒక్కటి మజ్లీస్, రెండు వైసీపీ.
దేవాలయాల నుంచి వచ్చిన ఆదాయాన్ని పాస్టర్లకు జీతాలు ఇస్తున్న మీరు మత్తత్త్వం గురించి మాట్లాడుతారా? వైసీపీ ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఉన్నాయా? మంత్రుల ఇల్లు తగులబెడితే కాపాడుకోలేని మీరు.. ప్రజలను ఏ విధంగా కాపాడుతారు? కోనసీమలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు వైసీపీ పాల్పడుతుందన్నారు. బియ్యం పంపిణీ చేసిన వాహనాల్లో మృతదేహాలను సరఫరా చేస్తున్నారు.
ఎమ్మెల్సీ జైలుకు పోతే రాచ మర్యాదలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నివాసానికి కూత వేటు దూరంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. గంజాయి ఎక్కడ దొరికిన ఏపీతో ముడిపడి ఉంది. ఆర్ధిక క్రమ శిక్షణ ఏపీ ప్రభుత్వానికి లేదు. అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందింది. అధికారంలో ఉండే అర్హత వైసీపీ ప్రభుత్వం కోల్పోయింది.
వైసీపీ ప్రభుత్వానిది అవినీతి ఎజెండా.. బీజేపీది అభివృద్ధి అజెండా అన్నారు విష్ణువర్థన్ రెడ్డి. భావితరాలకు భవిష్యత్తు ఉందా ఆంధ్రప్రదేశ్ లో అని ఆయన ప్రశ్నించారు. బీజేపీని రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీగా చూస్తున్నారు.2024అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తుంది. 12 నుంచి 14వేల నిధులు యూపీ కంటే ఎక్కువ నరేగా నిధులు ఏపీకి ఇచ్చాం. 21లక్షల ఇల్లు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది. మూడు నెలలకు ఒక్కసారి ప్రధానిని కలుస్తున్న జగన్ ఎందుకు ప్రత్యేక హోదా గురించి అడగడం లేదు. ఆంధ్రా, తెలంగాణ నిధుల పంచాయతీ వచ్చే సరికి బీజేపీని నిందిస్తున్నారు. దావోస్ లో అన్నదముళ్ళలా కలిసి ఆలింగనం చేసుకున్నప్పుడు.. ఎక్కడికి పోయింది ఈ పంచాయతీ అని విష్ణు ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Commercial LPG Price Hike: గ్యాస్ ధరల మంటలు .. భారీగా పెరిగిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!