Vishnu Vardhan Reddy Gives Clarity On BJP Janasena Alliance: బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయని.. ఈ రెండు పార్టీలు కలిసి 2024 ఎన్నికలను ఎదుర్కుంటాయని బీజీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2024 ఎన్నికలకు ఎలా వెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. ప్రజా ఉద్యమాలు, పార్టీ కార్యక్రమాలపై కూడా చర్చ జరిగిందన్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. వైసీపీ పాలన వైఫల్యాలపై ప్రజా ఛార్జిషీట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు.
Pan India War: దేవరతో యుద్ధానికి సిద్ధమవుతున్న పుష్పరాజ్…
తాము ఇచ్చిన హామీలపై వైసీపీ 90 శాతం వైఫల్యం చెందిందని విష్ణువర్ధన్ ఆరోపించారు. NGT, కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పేదల ఇళ్ల విషయంలో ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. బీజేపీపై జరిగే దుష్ప్రచారం ఎండగట్టాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. పవన్ బీజేపీతో లేరని దుష్ప్రచారం చేశారని.. రెండు పార్టీల పొత్తుపై ఇష్టానుసారంగా మాట్లాడేవారని.. అయితే అందులో వాస్తవం లేదని.. జనసేనతో బీజేపీ పొత్తు ఉందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎన్డీయే మీటింగ్‌కు పిలుపు ద్వారా అందరికీ కనువిప్పు కలిగిందన్నారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు.
YV Subba Reddy: జగన్ బీసీల పక్షపాతి.. ఆ ఘనత ఒక్క ఏపీ ప్రభుత్వానిదే
అనంతరం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయన్నారు. వాలంటీర్ వ్యవస్థను స్వలాభం కోసమే ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు. వాలంటీర్ల శ్రమను దోపిడీ చేస్తోందని.. వాలంటీర్లను ఆప్కాస్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. పార్టీ కార్యక్రమాలకు వాలంటీర్ల సేవలను ఉపయోగించుకుంటున్నారని పేర్కొ్న్నారు. పవన్ చేసిన ఆరోపణలను సవాల్‌గా తీసుకుని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల ద్వారా అధికారంలోకి వస్తామని భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రులు, పార్టీ నేతలకు ఎలాంటి అధికారం లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.