Vishnu Kumar Raju: కన్నాను కలిసిన విష్ణుకుమార్ రాజు.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnu Kumar Raju: బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, బీజేపీ ఏపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ.. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.. అయితే, కన్నా బాటలో పలువురు బీజేపీ నేతలు కూడా టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇప్పటికే కన్నా అనుచరులు బీజేపీకి గుడ్‌బై చెప్పి.. కన్నాతోనే మా ప్రయాణం అని స్పష్టం చేస్తుండగా.. ఇవాళ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రెడ్డి.. కన్నా ఇంటికి వచ్చారు.. ఈ సందర్భంగా సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు విష్ణుకుమార్ రాజు.. భారతీయ జనతా పార్టీలో పరిస్థితులు బాగోలేవన్న ఆయన.. బీజేపీ కార్యకర్తలతో.. నాయకులతో మాట్లాడే తీరిక అధిష్టానానికి లేదని విమర్శలు గుప్పించారు.. పార్టీలో వర్గ విభేదాలపై కేంద్రం దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకెళ్లాను.. అయినా ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Attack on TDP Office: గన్నవరంలో టెన్షన్ టెన్షన్.. టీడీపీ ఆఫీసుపై వంశీ వర్గీయుల దాడి..!
Also Read
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
అయితే, కన్నా లక్ష్మీనారాయణకి అధిష్టానానికి మధ్య ఉన్న విభేదాలపై నేను మాట్లాడను.. దీనికి బీజేపీ అధిష్టానం సమాధానం చెప్పాలన్న ఆయన.. గతంలో నేను బీజేపీ ఎమ్మెల్యేగా.. ఫ్లోర్ లీడర్‌గా పనిచేశాను.. కానీ, నేను చెప్పిన మాటలు కూడా అధిష్టానం వినే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు విష్ణుకుమార్ రాజు.. ఆంధ్రప్రదేశ్‌లోని బీజేపీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్న ఆయన.. నేను వ్యక్తిగతంగా కన్నాను కలవడానికి మాత్రమే వచ్చాను.. పార్టీ మారినంత మాత్రాన వ్యక్తి గత పరిచయాన్ని తెంచుకొలేను అని స్పష్టం చేశారు.. మరోవైపు.. తాజాగా బీజేపీ బైబై చెప్పిన కన్నాతో విష్ణుకుమార్ రాజు భేటీ కావడంపై కొత్త చర్చ తెరపైకి వచ్చింది.. విష్ణుకుమార్ రాజు కూడా బీజేపీ రాజీనామా చేస్తారనే చర్చ నడుస్తుండగా.. పార్టీ మారతాను అన్న ప్రచారం మాత్రం కరెక్ట్ కాదు.. నేను కేవలం వ్యక్తిగతంగా మాట్లాడడానికే కన్నా ఇంటికి వచ్చాను అని క్లారిటీ ఇచ్చారు విష్ణుకుమార్ రాజు.
తాజావార్తలు
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!