Botsa Satyanarayana: మొంథా తుఫాన్ సమయంలో పంట నష్టంపై ప్రభుత్వం దగ్గర సమగ్రమైన లెక్క లే లేవు… ఉంటే బహిర్గతం చేయండి అని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. 24 జిల్లాలలో రైతులు తుఫాన్ వల్ల నష్టపోతే ముఖ్యమంత్రి, మంత్రులు మాటలకే పరిమితం అయ్యారని విమర్శించారు. ఈ 18 నెలల కాలంలో వర్షాలు, కరువు కారణంగా నష్టపోయిన ఎన్ని మండలాలకు ఎంత పరిహారం చెల్లించారు లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.. పంట నష్టంపై పూర్తి స్థాయి ప్రకటన చేయడం లేదు… ఇన్సూరెన్స్ లను ప్రభుత్వం చెల్లించి ఉంటే రైతుకు నూటికి నూరు శాతం నష్టం భర్తీ అయ్యేది.. ఈ క్రాప్ విధానం రద్దు చేసి రైతులనే ఇన్సూరెన్స్ కట్టుకో మని వదిలేయడంతో ఎక్కువ మంది నష్టపోతున్నారు అని తెలిపారు.. అయితే, ప్రభుత్వం వైఫల్యాల మీద ఖచ్చితంగా రైతుల పక్షాన మాట్లాడతాం.. ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
Read Also: Historic Decision: మహిళా సాధికారత కోసం.. యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఇక, వైసీపీ హయాంలో రైతుల తరపున ప్రతీ పైసా ఇన్సూరెన్స్ మేం చెల్లించాం.. వైసీపీ హయాంలో 7 వేల కోట్లు మద్దతు ధర రూపంలో చెల్లించాం.. ఈ ప్రభుత్వంలో ఆ విధానం ఎక్కడైనా అమలైందా..? అని ప్రశ్నించారు బొత్స.. మరోవైపు, కాశీబుగ్గ దుర్ఘటనపై ప్రభుత్వ వైఖరి అభ్యంతరకరం… ప్రయివేట్ టెంపుల్ అని ఇష్టారాజ్యంగా మాట్లాడటానికి ఇంగిత జ్ఞానం వుండొద్దా..? అని ఫైర్ అయ్యారు.. చంద్రబాబు ఎప్పుడూ ముఖ్యమంత్రి అయినా దౌర్భాగ్యమైన ఘటనలు జరుగుతూనే ఉంటాయి… తిరుపతి, సింహాచలం ఘటనల్లో జరిగిన నష్టం, దర్యాప్తు నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? ఎక్కడ ఉంది మీ బాధ్యత..? అని నిలదీశారు.. రైతులు, భక్తులు, విద్యార్ధులు ఎవరి మీద మీకు బాధ్యత ఉంది..? అని నిలదీశారు.. ప్రభుత్వంపై భయం, భక్తి ఉండాలంటే యాక్షన్ వుండాలి.. రాజకీయ ఎదురు దాడి చేసి వైసీపీ గురించి మాట్లాడి దృష్టి మళ్లించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.. అసలు కాశీబుగ్గ ప్రమాదం వెనుక ఎవరి మీద చర్యలు తీసుకున్నారు ప్రభుత్వం చెప్పాలి… అక్రమ మద్యం కేసులో జోగి రమేష్ పై నన్ను అడిగితే సంబంధం లేదనే చెబుతాను.. ఒక వర్గం మీడియా కట్టు కథనాలుగానే భావిస్తున్నాను.. వైజాగ్ డ్రగ్స్ మీద మొదటి నుంచి నా విధానం క్లియర్.. మూడు సార్లు ఈ అంశంపై నేను మాట్లాడాను, సీబీఐకి, హోం శాఖకు లేఖలు కూడా రాశాను.. ప్రభుత్వ వైఫల్యం బయటపడిన ప్రతీసారి డైవర్ట్ చేసే ప్రయత్నం చేయడం అలవాటుగా మారిందని ఆరోపించారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.