Wall Collapse: వినాయక చవిత రోజున విశాఖపట్నంలో పెను ప్రమాదం తప్పింది.. విశాఖ పోలీస్ కమిషనరేట్ కు సమీపంలో కురుస్తున్న వర్షాలకు బాగా తడిసిన ఆరడుగుల ఎత్తు 30 మీటర్ల పొడవున్న ఓ గోడ కూలిపోయింది.. వినాయక మండపంతో పాటు సమీపంలోనే ఉన్న చిన్న చిన్న షాప్స్, బైక్ ల మీద పడడంతో ధ్వంసం అయ్యాయి.. గోడకు ఆనుకొని ఉన్న వినాయక మండపం మీద ఒక్కసారిగా కూలడంతో నలుగురు యువకులకు గాయాలయ్యాయి.. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో చిన్నారులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.. మిగతా ప్రమాదకరంగా మారిన గోడను కూల్చి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు స్థానికులు.. ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించారు విశాఖ సిపి శంఖ బ్రత బాగ్చి.. రద్దీగా ఉండే ప్రాంతంలో ఎవరూ లేనప్పుడు ప్రమాదం జరగడంతో.. భారీ ప్రమాదం తప్పినట్టు అయ్యింది.. మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి.. వరదలు విరుచుకుపడుతున్నాయి.. ఈ సమయంలో.. పురాత కట్టడాలకు దూరంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వస్తున్నారు..
Read Also: Gold Rates: మరింత పెరిగిన బంగారం ధర.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?