Visakhapatnam Port Authority: విశాఖపట్నం పోర్టు అథారిటీ (VPA) మరో అరుదైన ఘనత సాధించింది.. స్వచ్ఛత పఖ్వాడా అవార్డ్స్ 2024లో భారతదేశంలోనే మొదటి స్ధానంలో నిలించింది. తద్వారా విశాఖ ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలిపింది విశాఖ పోర్టు.. పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్‌వేస్ మంత్రిత్వశాఖ (MoPSW) నిర్వహించిన ఈ పోటీలో, శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్టు అథారిటీ (SMPA) రెండవ స్థానంలో నిలవగా.. ఇండియన్ మేరిటైమ్ యూనివర్సిటీ (IMU) మూడవ స్థానంలో నిలిచింది.. ఇక, స్వచ్ఛత మరియు పారిశుధ్య కార్యక్రమాల్లో విశేష కృషి చేసిన విశాఖపట్నం పోర్ట్ ని కేంద్ర మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా అభినందించింది. మంత్రిత్వ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం, “స్వచ్ఛత కి భాగీదారీ” మరియు “సంపూర్ణ స్వచ్ఛత” కార్యక్రమాల కింద పోర్ట్ పలు ప్రభావవంతమైన కార్యక్రమాలు చేపట్టింది. వీటిలో పెద్ద ఎత్తున నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమాలు, “ఏక్ పెడ్ మా కే నామ్” మొక్కలు నాటే కార్యక్రమం, గోడలపై చిత్రలేఖనం, పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ సందేశాన్ని ప్రోత్సహించే సృజనాత్మక పోటీలు ఉండడం విశేషం..
Read Also: PVNS Rohit : మొన్నే నేషనల్ అవార్డు.. నేడు ఎంగేజ్ మెంట్ చేసుకున్న సింగర్
మరోవైపు, 15 సంవత్సరాలుగా మునిగిపోయి ఉన్న పడవలను తొలగించిన.. ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన మెగా క్లీనప్ డ్రైవ్ ఈ కార్యక్రమాలలో విశేషంగా నిలిచింది.. పోర్ట్ వైద్య విభాగం, పారిశుద్ధ్య కార్మికుల కోసం సఫాయి మిత్ర సురక్ష శివిర్ నిర్వహించింది. ఇందులో వ్యాధి నిరోధక ఆరోగ్య పరీక్షలు, పీపీఈ కిట్ల పంపిణీ, వైద్య సదుపాయాల కల్పన వంటి సేవలు అందించారు. పర్యావరణ సుస్థిరత వైపు బలమైన అడుగులు వేస్తూ, పోర్ట్ విస్తృతస్థాయిలో పచ్చదనం అభివృద్ధి, ల్యాండ్‌స్కేప్ రూపకల్పన చేపట్టి, ASR, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో మొత్తం 31,800 మొక్కలు నాటింది. కంభాలకొండ ఈకో టూరిజం పార్క్‌లో 350 మంది తో ట్రెక్కింగ్ మరియు శుభ్రత కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం సమాజంలో ఐక్యతను పెంచడంతో పాటు, పార్క్ పరిసరాలను మరింత అందంగా మార్చింది విశాఖ పోర్ట్..
Read Also: K.A. Paul: నిమిష ప్రియను రెండు వారాల్లో వెనక్కి తీసుకోస్తాం.. కేఏ పాల్
ఇక, స్వచ్చతలో విశాఖపట్నం పోర్ట్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడంపై పోర్ట్ చైర్మన్ డా ఎం అంగముత్తు ఆనందం వ్యక్తం చేశారు. పోర్ట్ సాధించిన ఈ విజయంపై సిబ్బంది, భాగస్వాములను అభినందించారు.. స్వచ్ఛ భారత్ అభియాన్ లక్ష్యాల సాధనలో స్వచ్ఛమైన, పచ్చని మరియు ఆరోగ్యవంతమైన పర్యావరణం కోసం పోర్ట్ కట్టుబడి ఉన్నదని వెల్లడించారు. మొత్తంగా విశాఖపట్నం పోర్టు అథారిటీ సిగలో మరో కలికితు రాయి చేరినట్టు అయ్యింది.. కేంద్ర పోర్టులు నౌకా మరియు జలరవాణా మంత్రిత్వ శాఖలో చేపట్టిన స్వచ్చతా పఖ్వాడలో విశాఖ పోర్టు తొలి స్థానానికి దూసుకెళ్లింది.. గతంలో.. మూడో స్ధానంలో ఉన్న పోర్టు.. ఈ సారి తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది..