Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Crew Tanker Incident: పశ్చిమ ఆసియాలోని హార్మూజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు భారతీయ నావికుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. గత మూడు రోజుల వ్యవధిలో భారతీయ సిబ్బంది ఉన్న మూడు నౌకలకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకోవడంతో పరిస్థితి మరింత చర్చనీయాంశంగా మారింది. కొన్ని నివేదికల ప్రకారం, ఈ ఘటనల్లో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు.. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు భారతీయుల్లో విశాఖపట్నం వాసి కూడా ఉన్నట్లు ఢిల్లీలోని ఆంధ్రా భవన్ అధికారులు ధ్రువీకరించారు. మృతుడిని 44 ఏళ్ల మెరైన్ ఇంజినీర్ సురేష్ పట్నాలగా గుర్తించారు. జూన్ 24న ఆయన వివాహ 15వ వార్షికోత్సవం ఉందని.. అంతలోనే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సురేష్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఆయన మృతితో విశాఖలో విషాదం నెలకొంది..
అయితే, జూన్ 8న ఒమన్ ఆగ్నేయ తీర ప్రాంతంలో ‘మారివెక్స్’ అనే ట్యాంకర్‌కు సంబంధించిన సంఘటన చోటుచేసుకుంది. అమెరికా ఆంక్షలకు లోబడి ఉన్న ఈ నౌకపై చర్యలు తీసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. ఈ నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. అనంతరం జూన్ 9-10 తేదీల్లో ఒమన్ తీర ప్రాంతంలో ‘ఎంటీ సెట్టెబెల్లో’ అనే చమురు ట్యాంకర్‌కు సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా, వారిలో 21 మందిని సురక్షితంగా రక్షించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత ప్రభుత్వం ధృవీకరించింది.. ఇక జూన్ 11న ‘ఎంటీ జల్వీర్’ అనే నౌకకు సంబంధించిన మరో సముద్ర భద్రతా ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నౌకలో 21 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, రాయబార కార్యాలయం సమాచారం ప్రకారం, సిబ్బంది అందరినీ సురక్షితంగా తరలించే చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని నివేదికలు సూచిస్తున్నాయి.
Also Read
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..