Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Tdp High Command Finalizes Name Of Pila Srinivas As Greater Visakhapatnam Mayor Candidate

GVMC New Mayor: గ్రేటర్‌ విశాఖ మేయర్‌ అభ్యర్థి ఖరారు… రేపే ఎన్నిక..

Published Date :April 27, 2025 , 5:53 pm
By Sudhakar Ravula
  • జీవీఎంసీపై జెండా ఎగరేయాలన్న టీడీపీ కల ఎట్టకేలకు నెరవేరింది..
  • ఎన్నికల్లో కూటమి విజయం లాంఛనం..
  • మేయర్ అభ్యర్ధిగా ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ పేరు ఖరారు చేసిన టీడీపీ..
  • రేపు ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం..
GVMC New Mayor: గ్రేటర్‌ విశాఖ మేయర్‌ అభ్యర్థి ఖరారు… రేపే ఎన్నిక..
  • Follow Us :
  • google news
  • dailyhunt

GVMC New Mayor: ఏపీలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీపై జెండా ఎగరేయాలన్న టీడీపీ కల ఎట్టకేలకు నెరవేరింది. ఏడాది కాలపరిమితి కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి విజయం లాంఛనం అయింది. మేయర్ అభ్యర్ధిగా ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. పార్టీ బీఫార్మ్ ను పీలాకు అందజేశారు నగర పార్టీ అధ్యక్షుడు గండిబాబ్జీ. ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. 98 వార్డులతో వున్న మహా విశాఖ నగర పాలక పీఠం దక్కించుకోవడం రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తాయి. 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి వున్న స్టీల్‍ సిటీ పై పట్టు సాధించాలంటే మేయర్ పీఠం కీలకం. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి విశాఖ కంచుకోటే అయినప్పటికీ స్ధానిక సంస్ధలపై ఆజిమాయిషీ చేసే ఛాన్స్ లభించలేదు. 2011లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 58 వార్డులు గెలుచుకుని మేయర్ పీఠం దక్కించుకుంది. నలుగురు ఎమ్మెల్యేల బలం వుండి కూడా టీడీపీ 28 స్థానాలకు పరిమితం అయింది.

Read Also: Malla Reddy: బీఆర్ఎస్ రజతోత్సవ సభా వేదికపై.. మల్లారెడ్డి మాస్ డ్యాన్స్..

ఇక, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ బాడీస్ నాయకత్వం మార్పు అనివార్యం అయింది. ఆ జాబితాలో జీవీఎంసీ చేరగా అనూహ్యమైన రాజకీయ పరిణామాలు, క్యాంప్ రాజకీయాలు జరిగాయి. వైఎస్సార్సీపీ, కూటమి పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మ్యాజిక్ ఫిగర్ 74 కోసం ఆఖరి నిముషం వరకు ఊగి సలాట కొనసాగడంతో ఫలితం తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె, 6వ వార్డు కార్పోరేటర్ లక్ష్మీ ప్రియాంక ఓటుతో కూటమి గట్టెక్కింది. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నాలుగేళ్ల గ్రేటర్ విశాఖ మేయర్ గా పనిచేసిన గొలగాని హరివెంకటకుమారి పదవిని కోల్పోయారు. ఇక, డిప్యూటీ మేయర్ జియ్యాన్ని శ్రీధర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ సక్సెస్ చేసింది కూటమి. దీంతో మేయర్, డీప్యూటీ మేయర్ స్ధానాలు ఖాళీ అయ్యాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ముందుగా మేయర్ ఎలక్షన్ జరుగుతుంది. మొదటి నుంచి ప్రచారంలో వున్న పీలాశ్రీనివాస్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఉత్త రాంధ్ర పర్యటనలో ముఖ్యమంత్రి దగ్గరకు పీలాను తీసుకు వెళ్లిన ఎమ్మెల్యేలు ఆయన అభ్యర్ధిత్వానికి ఆమోదం లభింపజేసుకున్నారు.

Read Also: Pahalgam Terror attack: పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు.. టెర్రరిస్టుల ఎలా వచ్చారంటే..?

మరోవైపు, డిప్యూ టీ మేయర్ పీఠంపై కూటమి పార్టీలు మల్లగుల్లాలుపడుతున్నాయి. మొదట్లో మేయర్ టీడీపీ, డిప్యూటీ మేయర్ జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. సామాజిక సమీకరణాల ఆధారంగా బీసీ గవర కులానికి చెందిన పీలా శ్రీనివా స్ కు మేయర్ ఇస్తున్నందున.. జనసేన నుంచి కాపులకు ఛాన్స్‌ లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అయింది. పెద్దిశెట్టి ఉషశ్రీ పేరు చుట్టూ ఊహాగానాలు నడిచాయి. ఐతే, డీప్యూటీ మేయర్ విషయంలో టీడీపీ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. హరివెంకటకుమారిపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు యాదవ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది. బీసీ మహిళను పదవి నుంచి తొలగించేందుకు కుట్ర చేస్తున్నారనే ఆందోళన వ్యక్తం అయింది. రాజకీయ కారణాలతో హరి వెంకట కుమారిని మేయర్ పీఠం నుంచి దించేసిన యాదవులకు సముచిత స్ధానం కల్పించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆ దిశగా ఆలోచనలు చేసి డిప్యూటీ మేయర్ స్ధానం కోసం యాదవ మహిళను ఎంపిక చేయడం సముచితమనే భావనలో టీడీపీ వున్నట్టు కనిపిస్తోంది. ఆ దిశగా జనసేనతో చర్చలు జరుగుతున్నాయి. ఇరు పార్టీలు ఏకాభిప్రాయం సాధించగలిగితే డిప్యూటీ మేయర్ సైతం టీడీపీ కోటాలో చేరుతుంది. టీడీపీ కార్పొరేటర్లు గొలగాని నాగవేణి, మొల్లి హేమలతల్లో ఒకరికి ఛాన్స్ లభిస్తుందనే ప్రచారం ఉంది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Greater Visakhapatnam
  • GVMC Mayor
  • Pila Srinivas
  • TDP High Command

తాజావార్తలు

  • PM Modi: “మా నాన్న మోడీ చెబితేనే వింటారు”.. ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్‌పై స్పందించిన ప్రధాని.. ప్రజలకు కీలక విజ్ఞప్తి!

  • Trump: ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ వ్యూహం ఇదేనా? ఇరాన్ ఏం చేయబోతుంది?

  • New Airports: ప్రతీ 45 రోజులకు ఒక విమానాశ్రయం ప్రారంభం.. మంత్రి వెల్లడి..

  • Putin: ఇరాన్‌కు విశ్వసనీయ మిత్రులం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సందేశం

  • VI And BSNL: ఒకే గొడుగు కిందకు వొడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions