Ram Mandir Scam: విశాఖపట్నంలో అయోధ్య రామ మందిరం నమూన నిర్వాహకులపై నమోదైన చీటింగ్ కేసు ఎఫ్ఐఆర్ కాపీ ఎన్టీవీ చేతికి చిక్కింది. దేవుడు పేరుతో వ్యాపారం చేస్తున్న ముగ్గురు నిర్వాహకులపై త్రీటౌన్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రధాన నిర్వాహకుడు దుర్గాప్రసాద్, రాజా, గరుడ ప్రసాద్ లపై 318(4)r/w 3(5) BNS కింద కేసు నమోదు అయింది. సెట్ నిర్మాణానికి అవసరమైన డబ్బులను అమాయకుల నుంచి వసూలు చేసి మోసగించిన దుర్గా ప్రసాద్.. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు డబ్బులు ఇస్తానని బురిడి కొట్టించిన కేటుగాళ్లు.
Read Also: AB Devilliers: అసలేందుకు రిటైర్ అయ్యావు బాసు.. ఈ వయసులో కూడా దూకుడు తగ్గలేదుగా.. వీడియో వైరల్!
అయితే, ఈ నెల 29వ తేదీన భద్రాచలం వేద పండితులచే సీతారాముల కళ్యాణం నిర్వహించి సొమ్ము చేసుకోవడానికి అయోధ్య రామ మందిర నమూన నిర్వహకులు ప్లాన్ చేశారు. రూ. 3000 టికెట్ పెట్టి సుమారు 6000 జంటలతో కళ్యాణం నిర్వహించడానికి మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ టికెట్స్ ద్వారా వచ్చే ఆదాయం సుమారు రూ. కోటి 80 లక్షలకు పైగా ఉన్నట్లు సమాచారం. పోస్టర్లు, ఫ్లెక్సీలతో జోరుగా ప్రచారం చేశారు. ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లతో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహించారు. సెట్ నిర్మాణం తర్వత 50 రోజుల్లోనే సుమారు ఐదు కోట్ల బిజినెస్ జరిగినట్లు సమచారం.