NTV Telugu Site icon

MLC Botsa Satyanarayana: లడ్డూ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకండి.. విచారణ జరిపి చర్యలు తీసుకోండి..

Mlc Botsa

Mlc Botsa

MLC Botsa Satyanarayana: వివాదంగా మారిన తిరుమల లడ్డూ ఇష్యూ్కు ఇక్కడితో ముగింపు పలకాలని రాజకీయ పార్టీలను, మీడియాకు విజ్ఞప్తి చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. అయితే, విచారణ జరిపించి నిజాలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుమల లడ్డూపై రాజకీయాలు చేయడం.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడం అభ్యంతరకరం అన్నారు.. ప్రజల మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. అధికారంలో వున్న వాళ్లు విచారించి వాస్తవాలు బయట పెట్టాలి.. కానీ, ఆరోపణలు చేయడం సరైనది కాదు అన్నారు.. దేవుడితో రాజకీయాలు ఎవరు చేసిన తప్పే.. ఆరోపణలు చేస్తున్న వాళ్లు మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలన్నారు..

Read Also: Ponnam Prabhakar: మల్లన్న సాగర్ కు వచ్చింది ఎల్లంపల్లి నీళ్లా.. కాళేశ్వరం నీళ్ళా..? హరీష్ కు పొన్నం ప్రశ్న..

ఇక, వెజిటేబుల్ ఫ్యాట్ కలిసి నెయ్యిని ప్రసాదాలు తయారీకి వాడలేదని ఈవో చెబుతున్నారు.. కూటమి పార్టీలు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు బొత్స.. టీటీడీ తనిఖీల్లో నాణ్యత లోపాలు బయటపడితే నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించడం సాధారణ ప్రక్రియ.. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల హయాంలోనూ పలు మార్లు ట్యాంకర్లు వెనక్కు పంపించింది నిజం కాదా..? అని ప్రశ్నించారు.. శాంతి భద్రతలు, 100రోజుల అభివృద్ధిపై జరగాల్సిన చర్చ.. భక్తుల మనోభావాలతో ముడిపడిన లడ్డూ చుట్టూ తిప్పడం అన్యాయం అన్నారు.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు అయిన బడ్జెట్ ఎందుకు పెట్టలేదు..? టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల్లో జరిగిన అప్పులుపై వివరాలు బహిర్గతం చేయండి అని డిమాండ్‌ చేశారు..

Read Also: Devara : జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు చంద్రబాబు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.

మరోవైపు.. సంక్షేమ పథకాలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారు అని విమర్శించారు ఎమ్మెల్సీ బొత్స.. వరదల కారణంగా చనిపోయిన వాళ్ల లెక్కలు చెప్పమంటే.. ప్రకాశం బ్యారేజ్ ధ్వంసం కోసం బోట్లు పంపించారని మాట్లాడుతున్నారు.. బోట్లు వ్యవహారంలో వాస్తవాలు మీ అంతరాత్మకు తెలియదా…? అని ప్రశ్నించారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూశాం.. కానీ, ప్రభుత్వ అసమర్థత కారణంగా చనిపోవడం మన రాష్ట్రంలోనే చూశాం అన్నారు.. నెయ్యిని ప్రసాదాల్లో వాడలేదని ఈవో చేసిన ప్రకటనకు ఏం సమాధానం చెబుతారు..? అని నిలదీశారు.. స్వామి వారి ప్రసాదాల్లో అపచారం జరుగుతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. లేని పక్షంలో ఆరోపణలు చేసిన వ్యక్తి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు.. కూటమిలో వున్న బీజేపీ కూడా ఆ దిశగా ఆలోచించాలి.. లడ్డూ ప్రసాదాలను సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరగాలి అని డిమాండ్‌ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.