Gudivada Amarnath: యోగాంధ్రను చంద్రబాబు తన పబ్లిసిటీ కోసమే చేసినట్లు కనిపించింది తప్ప.. ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడలేదు అని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు లేకుండా ప్రజలను గాలికొదిలేసారు.. రాష్ట్రంలో ప్రజలంతా చూశారు.. ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అంత తాపాత్రయ పడతారో అర్ధం కావడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎలాంటి హామీలు ఇచ్చిందో అందరికి తెలుసు.. సూపర్ సిక్స్ పథకాల కోసం ఆలోచన లేదు కానీ రికార్డులు మీద శ్రద్ద ఉంది అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పేద విద్యార్థులు ఇబ్బదులు పడుతున్నారని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే రెండు వేలు కట్ చేసి పథకాలు అమలు చేస్తున్నారు అని అమర్‌నాథ్ తెలిపారు.
Read Also: Asaduddin Owaisi: ఇరాన్‌పై అమెరికా దాడి.. పాకిస్థాన్‌పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..
ఇక, ఎవరైనా ప్రశ్నించినా వారి నాలుక మందం అనే మాట రాష్ట్ర ముఖ్యమంత్రి నోట వినడం సోచనీయం అని మాజీమంత్రి అమర్‌నాథ్ చెప్పుకొచ్చారు. జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో యువత పోరు నిర్వహిస్తున్నాం.. కోటికి పైగా నిరుద్యోగులు ఉన్న రాష్ట్రం.. రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నాం.. ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తేదీన అన్నారు.. కానీ ఏ సంవత్సరమో చెప్పలేదు.. ఏవి ఇవ్వకుండా అన్ని చేసేశామని చెప్తున్నారు.. ప్రజలు నమ్మి నాలుగు సార్లు గెలిపిస్తే తూర్పు తిరిగి దణ్ణం పెట్టడం నేర్పించారని గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు.
