Site icon NTV Telugu

Gudivada Amarnath: లోక నాయకుడు కమల్ హాసన్.. లోక మాయకుడు చంద్రబాబు..!

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath:సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్‌ పర్యటనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు నాయుడు.. కమల్ హాసన్‌ను మించిపోయారని సెటైర్లు వేశారు.. లోక నాయకుడు కమల్ హాసన్ అయితే.. లోక మాయకుడు చంద్రబాబు అని.. దశవతారాలు చంద్రబాబు.. బాబు ఏక్ నెంబర్, బేటా దస్ నెంబర్ అంటూ.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై హాట్‌ కామెంట్లు చేశారు.. ఇక, మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారు అంటూ మరోసారి దుయ్యబట్టారు అమర్నాథ్..

Read Also: Jai Hanuman: ఈసారి పాన్ వరల్డ్ టార్గెట్..

గత రెండు రోజులుగా చంద్రబాబు, లోకేష్ లు.. వైఎస్‌ జగన్ పై, వైసీపీపై పడి ఏడుస్తున్నారు.. సింగపూర్ వెళ్లి సాధించింది ఏం లేక.. ఇక్కడ ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తేలిక జగన్ పై పడిపోతున్నారని విమర్శంచారు గుడివాడ అమర్నాథ్.. మంత్రి లోకేష్ బరువు తగ్గాడు తప్ప బుద్ధి పెరగలేదన్న ఆయన.. బాబుని మించి అబద్దాల కోరులా తయారయ్యాడు లోకేష్ అని మండిపడ్డారు.. సింగపూర్ లో ఎవరో ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ పెట్టారట.. తీరా ఆ కంప్లైంట్ ఎవరు పెట్టారు అంటే టీడీపీ సానుభూతి పరుడే పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.. ఇవన్నీ కూడా వైసీపీ ఖాతాలో వేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..

Read Also: Russia vs America: అమెరికాకు రష్యా హెచ్చరిక.. మా దగ్గర కూడా అణు జలాంతర్గాములున్నాయి..!

ఇక, 1995 నుంచి చంద్రబాబుకి సంబంధాలు ఉన్నాయని ఇప్పుడు లోకేష్ చేస్తున్నారు.. మేం ఎప్పుడూ అదే చెప్తున్నాం.. సింగపూర్‌లో బాబు సంబంధాలు ఏంటో అందరికీ తెలుసు అన్నారు అమర్నాథ్.. అక్కడ పెట్టుబడులు తేవడానికి కాదు ఇక్కడ దోచుకుంది అక్కడ దాచుకోవడమే.. అందుకే 58 సార్లు సింగపూర్ వెళ్లారు చంద్రబాబు. సింగపూర్ లో ఈశ్వరన్ వీరికి బిజినెస్ పార్టనర్ కాదా?! అని నిలదీశారు.. ఈ పదిహేను నెలల్లో ఏం సాధించారు?! ప్రజలకు చెప్పండి, బహిరంగంగా చర్చించండి. అదానీ డేటా సెంటర్ గురించి గొప్పలు చెప్పుకుంటున్నావు చంద్రబాబు.. అది రావడానికి కారణం వైసీపీ కాదా?! అని ప్రశ్నించారు.. మేం చేసిన పనులకు నీ గొప్పలుగా చెప్పుకుంటున్నావు.. 974 సముద్ర తీరం ఉంది.. ఈ తీరాన్ని వినియగించోవాలని, అభివృద్ధి చేయాలన్న ఆలోచన మీకు వచ్చిందా?! అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్..

Exit mobile version