Site icon NTV Telugu

Simhachalam Tragedy: విశాఖ వెళ్లనున్న వైఎస్.జగన్.. బాధిత కుటుంబాలకు పరామర్శ

Ysjagan

Ysjagan

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మధ్యాహ్నం 3:30 గంటలకు విశాఖ వెళ్లనున్నారు. కేజీహెచ్ ఆస్పత్రిలో సింహాచలంలో గోడ కూలిన ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలను, కోలుకుంటున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు.

ఇప్పటికే ఈ ఘటనపై జగన్ స్పందించారు. విశాఖ జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో భక్తుల మృతిపై జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ.300 టికెట్‌ క్యూలైన్‌‌పై గోడ కూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామి వారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మరణించిన భక్తుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Simhachalam Tragedy: పెళ్లై మూడేళ్లైంది.. ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ దంపతుల మృతి

సింహాచలం ఘటనలో ఏడుగురు భక్తులు మృతిచెందారు. మ‌‌ృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.25లక్షలు, కేంద్రం రూ.2లక్షలు సాయం ప్రకటించింది. క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3లక్షల సాయం ప్రకటించింది. రూ.కోటి సాయం ప్రకటించాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Simhachalam Tragedy: ప్రమాదంలో ఇంటీరియర్ డిజైనర్ సహా స్నేహితుడు మృతి

Exit mobile version