NTV Telugu Site icon

Purandeswari: విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు..

Purandeswari

Purandeswari

విశాఖలో ప్రధాని సభా వేదిక ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ కోసం మంచి ప్యాకేజీ కేంద్రం ప్రకటిస్తుందని తెలిపారు. ఉక్కు ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులో ఇబ్బందులు ఉన్నాయన్న విషయం కేంద్రమంత్రి దృష్టికి తీసుకుని వెళతామని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల జరిగే అభివృద్ధి నమూనాకు ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ అని పురందేశ్వరి తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు త్వరలో కేంద్ర ఉక్కు మంత్రి కుమార స్వామి రివైవల్ ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.. రూ.17 వేల కోట్లు రివైవల్ ప్యాకేజీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరంకు రూ.12500, టాక్స్ డివల్యూషన్ కింద 7200, పంచాయతీ రాజ్ శాఖకు 4800 MNREGS పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి కేంద్రం సహకరించిందని పురందేశ్వరి తెలిపారు. రూ.6000 కోట్లతో జల్ జీవన్ మిషన్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. మరోవైపు.. మోడీ సభలకు జన సమీకరణ అవసరం లేదని చెప్పారు.

మరోవైపు.. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ దాడిపై పురందేశ్వరి స్పందించారు. కాంగ్రెస్ అప్రజాస్వామికంగా వ్యవరించిందని దుయ్యబట్టారు. బీజేపీ నేతలపై దాడి చేయడం ఖండిస్తున్నామన్నారు. చట్టపరంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నామని పురందేశ్వరి తెలిపారు.

Read Also: Alleti Maheshwar Reddy : బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నా

ప్రధాని నరేంద్ర మోడీ రేపు (బుధవారం) విశాఖకు వస్తున్నారు. పర్యటనలో భాగంగా.. ఎన్టీపీసీ ప్రాజెక్ట్, వైజాగ్ రైల్వే జోన్, జోనల్ హెడ్ క్వార్టర్ శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన చేస్తారు. అంతేకాకుండా.. కొన్ని పూర్తి అయిన ప్రాజెక్ట్‌లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మంత్రులు ప్రత్యేకంగా ప్రధాని టూర్ పై దృష్టి పెట్టారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా వైజాగ్ వెళ్లి మరీ సమీక్ష నిర్వహించారు. మరోవైపు.. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వైజాగ్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు.

Read Also: Oneplus12 Offer: త్వరపడండి.. వన్‌ప్లస్ 12పై భారీ తగ్గంపు

Show comments