Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూకబ్జాలు, దోపిడీ యథేచ్ఛగా చేసుకోమని ఎమ్మెల్యేలను, మంత్రులను సీఎం చంద్రబాబు వదిలేశారని మాజీ మంత్రి బొత్స సత్యనారనాయణ ఆరోపించారు. సీరియస్ గా ఉండమని హెచ్చరించిన వారిలో పరివర్తన కనిపించడం లేదు.. ఆధారాలతో సహా అక్రమాలను బయటపెట్టిన ఇప్పటి వరకు ప్రభుతవం చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వంలో బిజినెస్ రూల్స్ అనేవే లేకుండాపోయాయి.. ఏదైన అడిగితే ఎంక్వైరీ చేస్తామంటున్నారు.. మంత్రులు సంతకం పెట్టిన తర్వాత విచారణ చేస్తామనటం ఏమిటి నాన్సెస్ కాకపోతే అని బొత్స మండిపడ్డారు.
Read Also: AA22×A6 : అల్లు అర్జున్ – అట్లీ కాంబో హాలీవుడ్ టచ్‌తో భారీ ప్లాన్!
పెన్షనర్లకు అండగా ఉంటాం..
ఇక, వికలాంగులు పెన్షన్లలో అర్హులైన వారిని తొలగించే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ నేత బొత్స అన్నారు. వెరిఫికేషన్ కు అవకాశం కల్పించకపోవడం దుర్మార్గమైన చర్య.. మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. వికలాంగుల పెన్షన్ సమస్యల మీద కార్యచరణ రూపొందిస్తున్నాం.. ఈనెల 30వ తేదీ వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాం.. రద్దైన పెన్షనర్లను కలెక్టర్ల దగ్గరకు తీసుకుని వెళ్ళి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని సత్యనారాయణ తెలియజేశారు.
స్టీల్ ప్లాంట్పై డిప్యూటీ సీఎంకు బొత్స సూచనలు..
డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కౌన్సిల్ సాక్షిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రకటించారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోనే విభాగాల ప్రైవేటీకరణ చేస్తున్నారు.. ఈ నెల 30వ తేదీన జరగనున్న జనసేన సభలో స్టీల్ ప్లాంట్ పై తమ పార్టీ విధానాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించాలి.. ప్రమాదకరమైన పరిస్థితులో ఉన్న స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క అడుగు తగ్గడానికి మేం సిద్దంగా ఉన్నాం.. ప్రధాన మంత్రి దగ్గరకు కలిసి వెళ్ళడానికి రెడీ.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మిక, ప్రజా సంఘాలను ఐక్యం చేస్తామని వెల్లడించారు.
Read Also: Rasha Tadaney : టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ అందుకున్న..రాషా తడానీ !
అలాగే, కార్యచరణ రూపొందించి ముందుకు వెళతామని మాజీ మంత్రి బొత్స తెలిపారు. త్వరలోనే తేదీలు ప్రకటిస్తామన్నారు. ఇక, 16 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్టీల్ ప్లాంట్ గురుంచి అడగలేదు అని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజల సమక్షంలోనే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జగన్ అడిగింది నిజం కాదా అని పేర్కొన్నారు. మరి మీరు ఎందుకు అడగటం లేదన్నారు.