Saradhyam Public Meeting: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. కూటమిలో భాగస్వామ్యంగా వుంటూనే సంస్ధాగతబలోపేతం కీలకమని భావిస్తోంది. ఈ దిశగా పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేసేందుకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ‘సారథ్యం’ పేరుతో రైల్వే గ్రౌండ్లో జరుగుతున్న మీటింగ్ కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. బీజేపీ ఏపీ నాయకత్వం మొత్తం ఇప్పటికే విశాఖకు చేరుకుంది. సభా ప్రాంగణంతో పాటు నగరంలోని ప్రధాన కూడళ్లు కాషాయమయం అయిపోయాయి. భారీ హోర్డింగ్స్, బీజేపీ జెండాల రెపరెపలాడుతున్నాయి. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుపుతున్న NDA సాధించిన విజయాలు., ఏపీకి ఇస్తున్న ప్రాధాన్య తను ప్రధానంగా చెప్పబోతోంది బీజేపీ. అదే సమయంలో మారుతున్న రాజకీయ పరిస్ధితులకు అనుగుణంగా నాయకత్వం అనుసరించాల్సిన వ్యూహాలను నడ్డా నిర్ధేశించనున్నారు. ఆ దిశగా ప్రణాళికాబద్ధమైన కార్యా చరణను ప్రకటించే అవకాశం వుంది.
Read Also: CM Chandrababu: ఎస్పీలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
2024 ఎన్నికల్లో కూటమి వైసీపీ, కాంగ్రెస్ సహా ఇతర రాజకీయపార్టీలకు ఏపీలో 43శాతం ఓట్లు నమోదయ్యాయి. ఏపీలో బలోపేతం అవ్వాలంటే విపక్షాల ఓట్లను తమవైపు తిప్పుకోవడం కీలకం అనేది బీజేపీ ఆలోచన. ఆ దిశగానే సారథ్యం సభ జరగనుంది. ఆ పార్టీకి చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి సత్యకుమార్ యాదవ్ పరిశీలించి నాయకత్వానికి సూచనలు చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మారిన తర్వాత జరుగుతున్న తొలి బహిరంగ సభ కావడంతో భారీ ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సారథ్యం పేరుతో ఇప్పటికే జిల్లాల పర్యటనలు పూర్తి చేశారు. చాయ్ పే చర్చ, శోభాయాత్రల ద్వారా స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడం, ఎన్నికల సన్నద్ధత వంటివి ప్రధానంగా టూర్లు నిర్వహించారు. ఈ షెడ్యూల్ కు ముగింపుగా సారథ్యం ముగింపు సభను విశాఖలో ఆర్గనైజ్ చేస్తోంది. సారథ్యం సభ ముగిసిన తర్వాత స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరుగుతుంది. ఈ సమావేశం చాలా కీలకమైనదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం, ఏపీ మెడిటెక్ జోన్ కు సంబంధించిన అంశాలపై నడ్డా రివ్యూ చేస్తారు. మరోవైపు, నడ్డా పర్యటనకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఆందోళన మొదలెట్టాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ రద్దు నిర్ణయం ప్రకటించిన తర్వాతే అడుగుపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు జీవీఎంసీ దగ్గర వామపక్ష పార్టీలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి.