Ayodhya Ram Mandir Set: విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన గరుడ అయోధ్య రామ్ మందిరం వివాదాస్పదంగా మారింది. 45 రోజుల పాటు ప్రజల సందర్శనతో కిటకిటలాడిన ఆలయం నమూనా దగ్గర సీతారాముల కళ్యాణం పేరుతో పోస్టర్లు బ్రోచర్లు కలకలం రేపుతున్నాయి. 2999/- రూపాయలు చెల్లించిన వారికి నమూనా అయోధ్య రామ్ మందిరం వద్ద భద్రాచలం ఆస్థాన వేద పండితుల సమక్షంలో జరిపే కళ్యాణంలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని విస్తృత ప్రచారం చేశారు. ఇది కాస్త భద్రాచలం ఆలయ అధికారులకు చేరడంతో తమ ప్రమేయం లేకుండా, అనుమతులు లేకుండా ఎలా నిర్వహిస్తారంటూ విశాఖ జిల్లా కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు రామ మందిరం నిర్వాహకులపై 318 (4) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా, కళ్యాణం టికెట్లు కొన్న భక్తులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆలయ నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Read Also: Bhatti Vikramarka: తెలంగాణ మోడల్ ను దేశం ఫాలో అవుతుంది..
ఇక, భద్రాచలం రాముడి కళ్యాణం పేరుతో భక్తులను మోసం చేస్తున్న గరుడ అయోధ్య రామ మందిర సెట్ నిర్వాహకులపై హిందూ సంఘాలు భగ్గు మంటున్నాయి. విశాఖ బీచ్ రోడ్డులో వేసిన నమూనా ఆలయాన్ని తక్షణం తొలగించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. రేపు హిందూ సంఘాలు ఆధ్వర్యంలో ఆందోళనలకు భక్తులు సిద్ధం అవుతున్నారు. ఉత్తరాంధ్ర సాధువులు రానుండటంతో వ్యవహారం మరింత ముదురుతోంది.