తెలంగాణలో కులగణన సర్వేపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెక్రటేరియట్ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో సోషియో ఎకనామిక్, పొలిటికల్, క్యాస్ట్ సర్వే చేసిందన్నారు. సర్వే మొదలు పెట్టినప్పుడు అనేక సందేహాలు, అవసరం లేదని కొన్ని రాజకీయ పార్టీలు అన్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే చారిత్రాత్మక సర్వేగా దేశంలో నిలబడుతుంది.. పోస్ట్ క్యాస్ట్, ప్రీ క్యాస్ట్ సర్వే రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టాం.. రాహుల్ గాంధీ ఆలోచనను భారత ప్రభుత్వం తప్పనిసరిగా ఒప్పుకునే పరిస్థితి వచ్చిందన్నారు.
Also Read:Supreme Court: ‘‘కన్స్యూమర్ ఈస్ కింగ్’’.. కస్టమర్లకు హోటళ్ల వివరాలు తెలుసుకునే హక్కు ఉంది..
తెలంగాణ ప్రభుత్వ సర్వే ఆధారంగా త్వరలో దేశంలో కులగణన జరుగబోతోంది.. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కలిసి తెలంగాణ సర్వే వారికి ఇచ్చి త్వరితగతిన పార్లమెంటులో మద్దతు కూడగట్టి బీసీ రిజర్వేషన్ బిల్ పాస్ చేయించేలా ఒత్తిడి తెస్తాం.. వంద మంది లోక్ సభ సభ్యులు, ఇతర పార్టీల సభ్యులను కలిసి బిల్ పాస్ కావడానికి వారి సహకారం తీసుకుంటాం.. ఓబీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వడం న్యాయమైంది.. సహేతుకమైనదని వారి మద్దతు కూడగడుతాం.. మంచి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు కులగణన చేస్తామని హామీ ఇచ్చారు.. దాని ప్రకారమే తెలంగాణలో అధికారంలోకి రాగానే కులగణన చేశాము..
Also Read:Tamil Nadu: అజిత్ కుమార్ కస్టడీ డెత్.. రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశం..
తెలంగాణ మోడల్ ను దేశం ఫాలో అవుతుంది. ఏ రాష్ట్రం అయిన కులగణన చేయాలంటే తెలంగాణను రిఫరెన్స్ గా తీసుకుంటారు.. ముఖ్యమంత్రి నాయకత్వంలో ఓ డెలిగేషన్ ముఖ్య నాయకులను కలసి మద్దతు అడుగుతాం.. 42శాతం బిసి రిజర్వేషన్లకు రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు మద్దతు ఇచ్చారు.. పార్లమెంటులో కూడా ఆ పార్టీలకు చెందిన మిగతా సభ్యులు కూడా మద్దతు ఇస్తారనే నమ్మకం మాకు ఉంది.. 82 కోట్ల పేపర్లలో సర్వే వివరాలు నిక్షిప్తం అయి ఉన్నాయి. మళ్లీ కులగణనలోని కులాల వివరాలు అసెంబ్లీలో పెడతాం.. 42శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్ కు పంపాము.. మాకు నమ్మకం ఉంది..
Also Read:Jagdeep Dhankhar Resign: ఉపరాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశారంటే..?
బీజేపీ రామచంద్రరావుకు దళితులు, బలహీన వర్గాలు అంటే చిన్న చూపు ఉంది.. గతంలో కొన్ని సార్లు అలాంటి ప్రయత్నాలకు ఆయన అడ్డు తగిలారు.. రాంచంద్రరావు లీగల్ నోటీసులకు భయపడే వాడు కాదు భట్టి విక్రమార్క.. సమయం వచ్చినప్పుడు లీగల్ నోటీసులకు సమాధానం చెబుతా.. బిసిలను మభ్య పెట్టె ఆలోచన మాకు లేదు.. బీఆర్ఎస్ కు ఆ అలవాటు ఉంది కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతారని విమర్శించారు.