Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- తుంగలం వద్ద కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్
- ఏడుగురు కార్మికులకు గాయాలు.. తృటిలో తప్పిన ప్రమాదం
- శిథిలాల కింద గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు
- నిర్మాణ లోపాలపై దర్యాప్తు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag ROB Collapse: విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని తుంగలం వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గాయపడగా, తృటిలో ఒక భారీ ప్రాణనష్టం తప్పింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
తుంగలం దగ్గర గత కొంతకాలంగా రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే, ఆదివారం మధ్యాహ్నం మూడు , నాలుగో పిల్లర్ల మధ్య డక్టింగ్ పనులు జరుగుతుండగా, ఆ భారీ నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ సుమారు 10 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా, వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Also Read
ఈ ప్రమాదంలో భారీ ప్రాణనష్టం తప్పడానికి ప్రధాన కారణం సమయమేనని చెప్పవచ్చు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు భోజన విరామానికి వెళ్లడంతో అక్కడ తక్కువ మంది ఉన్నారు. అంతేకాకుండా, ఆదివారం కావడంతో చాలా మంది పనిలోకి రాలేదని, లేదంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
బ్రిడ్జ్ కుప్పకూలిన వెంటనే పోలీసులు , సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ సమయంలో బ్రిడ్జ్ కింద నుండి వాహనదారులు ఎవరైనా వెళ్తూ శిథిలాల కింద చిక్కుకున్నారా అనే అనుమానంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. వాహనాలు లేదా బైక్లు ఏవైనా కింద ఉండిపోయాయా అన్న కోణంలో శిథిలాలను తొలగిస్తున్నారు. కార్మికులందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు, అయితే పూర్తి స్థాయిలో శిథిలాలను తొలగిస్తేనే స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి గాయపడిన కార్మికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిర్మాణంలో లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే అంశంపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!