Bharat Bandh: దేశవ్యాప్తంగా బుధవారం (జూలై 9) భారత్ బంద్‌కు పిలుపు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెలో భాగస్వామ్యం కానున్నాయి. దాదాపు 25 కోట్ల మందికి పైగా కార్మికులు ఈ బంద్‌లో పాల్గొనబోతునట్లు సమాచారం. ఈ బంద్ పిలుపు 10 ప్రధాన కార్మిక సంఘాలు ఇచ్చాయి. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, రైతుల అభ్యున్నతికి విరుద్ధంగా ఉన్న నిర్ణయాలు, కార్పొరేట్…
మరోసారి ఆందోళన బాట పట్టేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు సిద్ధమయ్యారు. జీతాల కోసం సమ్మెకు దిగనున్నారు. ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయంలో కార్మికులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. ఉక్కు ఉన్నతాధికారులను పిలిచి జేసీఎల్ (JCL) వివరణ కోరింది. కాగా.. ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు.
అంగన్వాడీలకు మద్దతుగా ఏపీ బంద్‌కు రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. 24వ తేదీన అంగన్వాడీలకు మద్దతుగా రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలని పిలుపును ఇచ్చాయి. అంగన్వాడీలకు సంఘీభావంగా రాష్ట్ర బంద్ చేయడం అవసరమని రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు భావించాయి.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. వరంగల్ జిల్లా హనుమకొండలో కార్మికుల నిరసనకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మద్దతు తెలిపారు. పలుచోట్ల కార్మికుల ర్యాలీలు నిర్వహించారు. మరోవైపు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.సిద్దిపేట పట్టణంలో కేంద్రప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించాయి కార్మిక సంఘాలు. ఆదిలాబాద్ లో బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర ముందు ఉద్యోగుల…
కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 23, 24 తేదీల్లో తలపెట్టిన సార్వత్రిక సమ్మెను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాయి కార్మిక సంఘాలు.. ఓవైపు దేశవ్యాప్తంగా ఇంకా కరోనా థర్డ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉండడంఓ.. మరోవైపు.. ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానుండడం.. ఇక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతుండడంతో.. తన సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్టు పేర్కొన్నారు.. అయితే, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తలపెట్టిన సమ్మె…
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తల పెట్టిన సమ్మె వాయిదా వేశారు.. వేతన ఒప్పందం అమలు కోసం ఈ నెల 31వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లనున్నట్టు మొదట నోటీసులు ఇచ్చింది అఖిలపక్షం.. అయితే, కార్మిక సంఘాలతో ఇవాళ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్, ఆర్.ఐ.ఎన్. ఎల్.యాజమాన్యం చర్చలు జరిపింది.. ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.. అయితే, ఆ తర్వాత ఈ నెల 31వ తేదీ నుంచి తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్టు…