YS Jagan: నేడు జోగి రమేష్‌ ఇంటికి వైఎస్ జగన్.. పోలీసుల ఆంక్షలతో హైటెన్షన్

  • నేడు విజయవాడలో వైఎస్ జగన్ పర్యటన..
  • మాజీమంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్న జగన్..
  • జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న జగన్..
  • వైఎస్ జగన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలు..
  • ట్రాఫిక్ కారణంగా రూట్ మ్యాప్ మార్చాలంటూ నోటీసులు..
Ys Jagan

Ys Jagan

YS Jagan: దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇవాళ ఇబ్రహీంపట్నంకు మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఇబ్రహీంపట్నం బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు ఇటీవల దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్‌ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.. అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇక, వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

అయితే, విజయవాడ నగరంలో నుంచి జగన్ కాన్వాయ్ వెళ్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలని పార్టీ కార్యాలయ ప్రతినిధులకు నగర సీపీ రాజశేఖర్ నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనకు వెళ్లేందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు వైసీపీ నేతలకు నోటీసులు కూడా ఇచ్చారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి పర్యటన రూట్ మ్యాప్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది.