Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై అన్ని పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి.. ఇక, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయంతో పనిచేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విజయవాడలో సమావేశమైన కూటమి నేతలు ఎన్నికల కార్యాచరణపై చర్చించినట్లు చెప్పారు. ఎక్కడ ఒక పార్టీ కొంత తగ్గితే.. మరోచోట ఇంకో పార్టీ సర్దుబాటు చేసుకునేలా సమన్వయం చేసుకుంటామని, గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల కోసం కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం గతంలో ఎవరూ చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. తమ మున్సిపాలిటీలో గత రెండేళ్లలో రూ.70 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని, మరో రూ.140 కోట్ల నిధులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
వైసీపీపై తీవ్ర విమర్శలు
వైసీపీకి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని మంత్రి పార్థసారథి విమర్శించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అయితే శాసన మండలిలో సంఖ్యాబలం ఉందనే కారణంతో వచ్చి గందరగోళం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారు ఎన్నికల్లో పోటీ చేయడంపై పునరాలోచన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని పార్థసారథి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఏయే మున్సిపాలిటీలకు ఎంతమేర నిధులు ఇచ్చారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
Also Read
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
కూటమిలో సమైక్యత ఉంది
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల నేతల మధ్య పూర్తి సమైక్యత ఉందని మంత్రి పార్థసారథి తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, పీవీఎన్ మాధవ్ చూపిస్తున్న స్ఫూర్తితో పనిచేస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 94 శాతానికి మించి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే తాము ఎక్కడా ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయని చెప్పలేదని, ప్రత్యర్థులే భయపడి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కూటమి పార్టీల మధ్య స్థానిక స్థాయిలో సమన్వయం పెంచడం, విభేదాలను పరిష్కరించడం ఎన్నికల సన్నాహాల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
టీచర్ల ఉద్యమంపైనా స్పందన
టీచర్ల ఉద్యమం సందర్భంగా గంజాయి బ్యాచ్, రౌడీలతో పాటు గుడ్లతో దాడులు చేయిస్తారా అని పార్థసారథి ప్రశ్నించారు. తమపై తమకే నమ్మకం లేకపోవడంతో ప్రత్యర్థులు రకరకాలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో కూటమి భాగస్వామ్య పక్షాలు స్థానిక స్థాయిలో సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కార్యాచరణను కొనసాగిస్తున్నాయి అని వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి..
తాజావార్తలు
-
Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
-
In Service Teachers TET: బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1న మరో టెట్ నోటిఫికేషన్..
-
22A Registrations: తెలంగాణలో 22-A ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులు వర్తిస్తాయ్..
-
Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
-
Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?