Indrakeeladri: విజయవాడ దుర్గమ్మ గుడిలో అపచారం ఘటన బాధ్యులకు నోటీసులు..
- విజయవాడ దుర్గగుడిలో అపచారం ఘటనపై బాధ్యులకు మెమోలు జారీ..
- అపచార ఘటనపై ఈవోకు నివేదిక అందజేసిన కమిటీ..
- అభిషేకానికి వినియోగించిన పాలలో పురుగులు గుర్తింపు..
- స్టోర్, పూజా విభాగాల ఉద్యోగులు, అర్చకుడికి మెమోలు జారీ..
- ఆలయంలో అన్ని అభిషేకాలు, పూజలకు ఆవు పాలే వినియోగించాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indrakeeladri: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఇటీవల చోటు చేసుకున్న అపచారం ఘటనపై ఆలయ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన వారికి మెమోలు జారీ చేశారు. అభిషేకానికి వినియోగించిన ఆవు పాలలో పురుగులు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో, స్టోర్, పూజల విభాగాలకు చెందిన ఉద్యోగులతో పాటు సంబంధిత అర్చకుడికి నోటీసులు జారీ చేశారు. విచారణలో అభిషేకానికి వాడిన బిందె పరిశుభ్రంగా లేకపోవడమే ఈ ఘటనకు కారణమని కమిటీ నిర్ధారించింది. పురుగులు ఉన్న బిందెలోనే పాలు పోసి అర్చకుడు అభిషేకం చేసినట్లు తేలింది.
Read Also: Shubman Gill: బౌలర్లకు అవకాశాలు.. శుభ్‌మన్ గిల్ ఏమ్మన్నాడంటే?
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్‌షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
అయితే, ఈ ఘటనపై ఆలయ ఈవోకు కమిటీ నివేదికను సమర్పించింది. అలాగే, ఈ ఘటన గురించి ఆలయ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేయడం తప్పని కమిటీ అభిప్రాయపడింది. కమిటీ విచారణలో స్టోర్, పూజల విభాగాల్లోని సిబ్బంది నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా బయటపడినట్లు పేర్కొంది. శ్రీచక్ర నవావరణార్చన నిర్వహించే అర్చకుడికి మెమో జారీ చేయడంతో పాటు అతడిని అంతర్గతంగా బదిలీ చేస్తూ పల్లకి సేవ, దర్బార్ సేవ, లక్ష కుంకుమార్చన పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. స్టోర్, పూజల విభాగాల ఉద్యోగులు వివరణ ఇవ్వాలని ఆలయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Trump: ట్రంప్ మరో దూకుడు.. వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటన
అలాగే, కమిటీ నివేదికను రెండు నుంచి మూడు రోజుల్లో దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఆలయ ఈవో పంపనున్నారు. ఇకపై ఆలయంలో జరిగే అన్ని అభిషేకాలు, పూజలకు తప్పనిసరిగా ఆవు పాలను మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. సంప్రదాయాలకు కట్టుబడి, నియమ నిబంధనల ప్రకారం పూజలు నిర్వహించాలని ఈవో స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!