Vallabhaneni Vamsi Case: విజయవాడ జైలులో ఉన్న వల్లభనేని వంశీని ములాఖత్‌లో కలిశారు ఆయన భార్య పంకజ శ్రీ, మాజీ మంత్రి పేర్ని నాని.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. వంశీని కలిశాం.. కింద పడుకోవడం కొంచం ఇబ్బందిగా ఉంది.. గట్టు ఉన్న ప్రదేశం కేటాయించామని రిక్వస్ట్ చేశామని తెలిపారు పేర్ని నాని.. పరిపాలనలో ఉన్న రాజకీయ నాయకులను సంతృప్తి పరచడం, మానసింకంగా ఆనంద పరచడం కోసం వైసీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించిన ఆయన.. 10వ తేదీన సత్యవర్ధన్ కోర్టులో స్టేట్ మెంట్ ఇచ్చారు.. 11 వ తేదీ 5 క్రిమినల్ కేసులు ఉన్న టీడీపీ వక్తితో ఫిర్యాదు తీసుకొని కేసు పెట్టారు.. 12వ తేదీ సత్యవర్ధన్ అన్నతో ఫిర్యాదు చేయించి కేసు పెట్టారు.. 12వ తేదీ పెట్టించిన కేసులో 11వ తేదీ కేసు పెట్టిన వ్యక్తి సాక్షి.. అసలు పెట్టిన సెక్షన్లు ఈకేసుతో సంబంధం లేదని ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీ కోర్టుకి కాకుండా వేరే కోర్టుకి కేసు తీసుకొని వెళ్లి విజయవాడ జైల్లో పెట్టారు.. చట్టంలోని నిబంధనలు పక్కన పెట్టి మరి పోలీసులు యాక్ట్ చేశారని విమర్శించారు పేర్ని నాని.. ఇక, గుంటూరు మిర్చి యార్డ్‌లో జగన్ పర్యటనలో నేను లేను.. మచిలీపట్నంలో వున్నాను.. మచిలీపట్నంలో మన్సిపల్ కమిషనర్ దగ్గర వున్నాను.. వైసీపీలో యాక్టివ్ గా ఉన్న వాళ్లపై తప్పుడు కేసులు పెడుతున్నారు.. పోలీసులే ఒక కేసు సిద్ధం చేసి ఫ్లయింగ్ స్క్వాడ్‌తో ఫిర్యాదు చేయించారు.. DGPకి లేఖ రాశాను.. మానసికంగా ఇబ్బంది పెట్టిన వారిని కూడా కోర్టుకి లాగుతాను అన్నారు. మచిలీపట్నంలో వైసీపీ లీడర్స్ తో పాటు వాళ్ల కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్స్ స్వీకరిస్తున్నారు.. రమేష్ హాస్పిటల్ వద్ద 17 మంది కానిస్టేబుల్ తో ఒక వింగ్ ని ఏర్పాటు చేసి వైసీపీ లీడర్స్ ఫోన్స్ ట్రాప్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.. ఇక, కొల్లు రవీంద్ర మంత్రి పదవికి పనికి రాడు అంటూ ఫైర్ అయ్యారు పేర్నినాని..
Read Also: CM Revanth Reddy : రాజశేఖర్ రెడ్డి చెప్పులు మోసింది, ఊడిగం చేసింది కేసీఆర్ కాదా..?
మరోవైపు వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీ మాట్లాడుతూ.. కౌంటర్ వేయడానికి వాళ్ల వద్ద మెటీరియల్ లేకపోవడంతో ప్రోలాంగ్ చేస్తున్నారని విమర్శించారు.. పేర్ని నాని, కొడాలి నానిని ములాఖత్‌కి కుదరదని చెప్పారని తెలిపారు.. ఇక, మాకు రక్షణ కల్పించలేమని.. సీపీ గారు ఒప్పుకోలేదు.. ఈ రోజు కూడా అనుమతి ఇవ్వను అన్నారు.. కొద్ది సేపు వాదన తరువాత ములాఖత్‌కి పంపించినట్టు వెల్లడించారు వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీ.