Srushti IVF Scandal: బెజవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ఈ దర్యాప్తులో కీలక విషయాలు గుర్తించారు. అయితే, 9 రోజుల పాటు ఆసుపత్రిలో డాక్టర్ నమ్రత హోమాలు నిర్వహించినట్లు తేలింది. బీహార్ నుంచి పూజారులను పిలిపించి హోమాలు చేయించిన నమ్రత.. వ్యాపార అభివృద్ధి కోసం హోమాలు చేయించినట్లు సమాచారం. బెజవాడ సృష్టిలో ముగ్గురు డాక్టర్ల ద్వారా కార్యకలాపాలు కొనసాగించినట్లు టాక్. డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో బెజవాడ సెంటర్ నిర్వహణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక, డాక్టర్ సోనాలి ఆధ్వర్యంలో పేషంట్స్ కి చికిత్స కొనసాగుతుంది. గతంలో నమ్రతకు ఉన్న లైసెన్స్ రద్దు కావడంతో డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ను నమ్రత నడిపిస్తుంది.. తాజా ఘటనతో బెజవాడ సెంటర్ ఎవరి పేరుతో నడుపుతున్నారో అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Also: Kondapur Rave Party: కొంపలో కుంపటి.. రేవ్ పార్టీలో 2 కేజీల గంజాయి సీజ్, 9 మంది అరెస్ట్!
మరోవైపు, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మీద గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్ కు చెందిన బాధితురాలు సోనియా ఇచ్చిన ఫిర్యాదుతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై BNS 61,316,318,335,336,340 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. అయితే, ఆగస్టు 2024లో రాజస్థాన్ కు సోనియా దంపతులు.. తమకు సంతానం కావాలని IVF ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రతాను కలిశారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం 30 లక్షల రూపాయలను డాక్టర్ నమ్రత డిమాండ్ చేసినట్లు సమాచారం. రూ. 15 లక్షల రూపాయలు చెక్కు రూపంలో మిగిలిన 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ ద్వారా బదిలీ చేసిన దంపతులు.. ఈ ప్రొసీజర్ లో భాగంగా విశాఖపట్నంలోని మరో బ్రాంచ్ కు దంపతుల శాంపిల్స్ కలెక్షన్ కోసం పంపించింది డాక్టర్. కేవలం మెడికల్ టెస్టుల కోసం రూ. 66 వేలను తీసుకున్నట్లు ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు.