Shakambari Utsavalu 2025: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై నేటితో శాకంబరీ ఉత్సవాలు ముగియనున్నాయి.. రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవాలతో హరిత వర్ణ ఆభరణాలతో దర్శనమిచ్చారు శ్రీ కనకదుర్గమ్మ.. కూరగాయలు, ఆకు కూరలతో ఆలయం అలంకరించారు.. పండ్లు, కూరగాయలు ఆభరణాలుగా దర్శనమిస్తున్నారు దేవతామూర్తులు.. మరోవైపు, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.. ఇక, ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణకు సిద్ధమవుతున్న భక్తులు.. కాసేపట్లో శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద నుండి గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది.. ఉదయం 8 గంటల తర్వాత నుంచి పారాయణాలు, హోమాలు, పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నియ.. 9:30 గంటలకు మహా పూర్ణాహుతి, ప్రసాద వితరణ తర్వాత ఉత్సవాలు ముగియనున్నాయి..
Read Also: Ravi Teja : ట్విస్ట్ ఇచ్చిన కళ్యాణ్ శంకర్ – సోషియో ఫాంటసీలోకి మాస్ మహారాజా రవితేజ!
మరోవైపు, ఇంద్రకీలాద్రి పై రెండోవ రోజు శాకంబరీ ఉత్సవాలకు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు.. శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రకృతి సిద్ధమైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో ఆలయం మొత్తం వైభవంగా అలంకరించబడింది. ఆలయ ప్రాంగణంలో గోంగూర, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించారు.. గర్భగుడి దగ్గర నుంచి ఉప ఆలయాల వరకు ప్రతీచోటా ప్రకృతివాతావరణం అనుభూతి చెందేలా తీర్చిదిద్దిన విషయం విదితమే కాగా.. రెండు రోజు పాటు వైభవంగా సాగిన శాకంబరీ దేవి ఉత్సవాలు.. ఇవాళ మూడో రోజుతో ముగియనున్నాయి..