AP Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి.. విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రాజ్ కేసిరెడ్డి.. కాగా, గతంలో లిక్కర్ స్కాం కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిష్లను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం విదితమే కాగా.. రాజ్ కేసిరెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు కేసిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో, మరోసారి కోర్టును ఆశ్రయిస్తూ.. మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రాజ్ కేసిరెడ్డి..
Read Also: Kurnool : భారీగా పడిపోయిన ఉల్లి ధరలు కర్నూరులో రోడ్డెక్కిన ఉల్లి రైతులు
మరోవైపు, ఈ కేసులో నాలుగోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు సజ్జల శ్రీధర్ రెడ్డి.. ఈ కేసులో ఏ6గా ఉన్నాు శ్రీధర్ రెడ్డి.. ఇక, మద్యం కుంభకోణంలో కేసులో నిందితులుగా ఉన్న ఏ31-ధనుంజయ రెడ్డి, ఏ32-కృష్ణ మోహన్ రెడ్డి, ఏ-33 బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.. ముగ్గురు నిందితులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరువర్గాల వాదనలు విని.. ముగ్గురికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.. ఇక, రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి తాజా పిటిషన్లపై రేపు ఏసీబీ కోర్టులో విచారణ జరిగి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.