Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని మళ్లీ కస్టడీకి ఇవ్వండి.. పోలీసుల మరో పిటిషన్‌

  • వల్లభనేని వంశీని రెండోసారి కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్‌..
  • వంశీని 3 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరిన పోలీసులు..
  • నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో కస్టడీ కోసం నూజివీడు కోర్టులో పిటిషన్..
Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi: వైఎస్సార్ కాంగ్రెస పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పటికే నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసింది నూజివీడు కోర్టు.. మరోవైపు.. వల్లభనేని వంశీనీ రెండోసారి కస్టడీకి కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు పోలీసులు.. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీని మూడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు తాజాగా పిటిషన్‌ వేశారు.. ఇప్పటికే ఇదే కేసులో రెండు రోజుల పాటు వల్లభనేని వంశీని న్యాయస్థానం కస్టడీకి ఇచ్చింది.. అయితే, వంశీ సరిగా విచారణకు సహకరించక పోవటంతో మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు.. అయితే, పోలీసుల పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన నూజివీడు కోర్టు.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది..

Read Also: Andhra Pradesh: గోదావరిలో 8 మంది యువకుల గల్లంతు.. శుభకార్యానికి వెళ్లి..!

కాగా, ఇప్పటికే పలు కేసుల్లో బెయిల్‌, ముందస్తు బెయిల్‌ పొందారు వల్లభనేని వంశీ.. కానీ, చివరల్లో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో కోర్టు వల్లభనేని వంశీపై పీటీ వారెంట్‌కు అనుమతి ఇవ్వడంతో కథ అడ్డం దిరిగింది.. ఇక, నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి రిమాండ్‌లో ఉన్న వల్లభనేని వంశీ పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు.. మెరుగైన చికిత్స నిమిత్తం ఆయన్ను పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తుండగా.. ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు.. మరోవైపు.. ఈ విషయం తెలుసుకుని జీజీహెచ్‌కు చేరుకున్న వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీని.. వంశీని కలిసేందుకు పోలీసులు అనుమతించలేదు.. దీంతో, ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగిన విషయం విదితమే.. మరోవైపు.. నూజివీడు కోర్టులో వల్లభనేని వంశీకి చుక్కెదురైంది. వంశీ మోహన్‌ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది నూజివీడు కోర్టు… నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు వల్లభనేని వంశీ.. అయితే, దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి.. బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. వంశీ ప్రస్తుతం ఇదే కేసులో అరెస్టై విజయవాడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం విదితమే..